News August 20, 2025
పోచారం ప్రాజెక్టును పరిశీలించిన ఇరిగేషన్ డీఈ

పోచారం ప్రాజెక్టును డీఈ వెంకటేశ్వర్లు పరిశీలించారు. లింగంపేట పెద్దవాగు, గుండారం వాగుల ద్వారా ప్రాజెక్టులోకి 3,904 క్యూసెక్కుల వరద నీరు వస్తోందని తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 21 అడుగులు కాగా, ప్రస్తుతం ప్రాజెక్టులో 22 అడుగుల నీరు నమోదైందని చెప్పారు. 3,904 క్యూసెక్కుల వరద నీటిలో, 3854 క్యూసెక్కుల నీటిని నిజాంసాగర్ ప్రాజెక్టులోకి విడుదల చేస్తున్నట్లు ఆయన వివరించారు.
Similar News
News January 18, 2026
రథసప్తమి వేడుకలకు పటిష్ఠ బందోబస్తు: ఐజీ

అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలను వైభవంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ ఏర్పాట్లు చేస్తోందని విశాఖ రేంజ్ ఐజీ గోపీనాథ్ జట్టి తెలిపారు. శనివారం జిల్లా ఎస్పీ, డీఎస్పీలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన భద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని క్యూలైన్లు, బారికేడ్లు, వాహనాల పార్కింగ్ మరియు రూట్ మ్యాప్‌లపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.
News January 18, 2026
అనంతపురం: 19న కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

అనంతపురం జిల్లా ప్రజలు 1100 కాల్ సెంటర్ సేవలను వినియోగించుకోవాలని ఇన్‌ఛార్జ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ సూచించారు. ఈనెల 19న కలెక్టరేట్‌లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు తెలిపారు. అర్జీదారులు meekosam.ap.gov.in ద్వారా ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చని చెప్పారు.