News August 12, 2025
పోచారం ప్రాజెక్ట్ నీటిమట్టం ఆప్డేట్

మెదక్-కామారెడ్డి జిల్లా సరిహద్దుల్లో గల పోచారం ప్రాజెక్టు నీటిమట్టం మంగళవారం ఉదయం 20 అడుగులకు చేరింది. ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా కామారెడ్డి, లింగంపేట, గాంధారి నుంచి వస్తున్న వాగులు పారడంతో ప్రాజెక్టులోకి నీరు చేరుతుంది. ఓవర్ ఫ్లో కావడానికి మరో అర అడుగు దూరంలో ఉంది. 20.5 అడుగుల నీరు వస్తే ప్రాజెక్టు ఓవర్ ఫ్లో కానుంది. ప్రాజెక్ట్ నిండుకోవడంతో పర్యాటకుల సందడి నెలకొంది.
Similar News
News March 7, 2026
MDK: నొప్పి తట్టుకోలేక ఆత్మహత్య

మెదక్ జిల్లా తూప్రాన్‌కి చెందిన తాపీ మేస్త్రి తిమ్మాపురం సత్యనారాయణ (55) అనారోగ్యం కారణంగా ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. గతంలో ఆయనకు బైపాస్ సర్జరీ జరిగ్గా, ఇటీవల పక్షవాతం (పెరాలసిస్) బారిన పడ్డారు. శారీరక ఇబ్బందులతో నొప్పి తట్టుకోలేక శనివారం ఇంట్లో ఉరివేసుకున్నట్లు ఎస్సై గంగరాజు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News March 7, 2026
మెదక్: ‘ప్రజా పాలన’ విజయవంతం చేయాలి: మంత్రి

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 99 రోజుల ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి పిలుపునిచ్చారు. మెదక్ MLA క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. MLA రోహిత్ రావు, MP సురేష్ షెట్కర్, MLA సంజీవరెడ్డి, DCC అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్లతో కలిసి ఆయన నాయకులకు దిశానిర్దేశం చేశారు.
News March 5, 2026
హవేలీఘనాపూర్: విద్యుదాఘాతంతో రైతు మృతి

హవేలీఘనాపూర్ మండలం బి. తిమ్మాయిపల్లి గ్రామంలో విషాదం నెలకొంది. గ్రామ శివారులోని ట్రాన్స్‌ఫార్మర్ వద్ద మరమ్మతులు చేస్తుండగా విద్యుత్ షాక్‌కు గురై రైతు ఎర్ర బిక్షపతి(42) అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య నాగమణి, ఒక కుమారుడు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రైతు మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.


