News November 7, 2024

పోర్టు పనుల వేగవంతానికి అధిక మొత్తంలో యంత్రాలు: కలెక్టర్

image

బందరు పోర్టు నిర్మాణ పనులను వేగవంతం చేసేందుకు అధిక మొత్తంలో అవసరమైన యంత్రాలను ఉపయోగించాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. పోర్టు నిర్మాణ పనులపై ఆయన సమీక్షించారు. 2025 డిసెంబర్ నాటికి తొలి విడత పనులు పూర్తి చేసేలా ప్రణాళికాబద్ధంగా పనులు చేయాలన్నారు. పనుల పురోగతిని పరిశీలించేందుకు త్వరలోనే పోర్టు పనుల సందర్శనకు వస్తానన్నారు.

Similar News

News December 6, 2024

అంబేడ్కర్ అడుగుజాడల్లో ప్రయాణిద్దాం: లక్ష్మీశ

image

అంబేడ్కర్ అడుగుజాడ‌ల్లో ప‌య‌నిస్తూ దేశాభివృద్ధికి కృషిచేద్దామ‌ని శుక్రవారం క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ అన్నారు. బి.ఆర్ అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా శుక్ర‌వారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాల‌యంలో జ‌రిగిన ప్ర‌త్యేక కార్య‌క్ర‌మంలో క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంరతం కలెక్టర్ మాట్లాడుతూ.. అంబేడ్కర్ దేశానికి అందించిన సేవ‌ల‌ను కొనియాడారు.  

News December 6, 2024

విజయవాడకు సీఎం రాక.. ఏర్పాట్ల పరిశీలన 

image

విజయవాడ శివారు పోరంకిలో రేపు సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఎస్పీ గంగాధర్ రావు, కలెక్టర్ డీకే బాలాజీ శుక్రవారం సీఎం పర్యటన ఏర్పాట్లను శుక్రవారం పరిశీలించారు. పోరంకిలోని ‘మురళీ రిసార్ట్స్’లో జరిగే ఊర్జావీర్’కు హాజరుకానున్నారు. సీఎం రాక సందర్భంగా ట్రాఫిక్‌కు ఎటువంటి అంతరాయం లేకుండా చూడాలని వారు అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. అనంతరం ఫంక్షన్ హాల్‌లోని తనిఖీలు చేసినట్లు వెల్లడించారు.

News December 6, 2024

ఫేక్ పాస్‌పోర్టుతో చిక్కిన కృష్ణా జిల్లా మహిళ

image

ఓ మహిళ ఫేక్ పాస్‌పోర్టుతో విదేశాల నుంచి వచ్చిన ఘటన ఇది. కృష్ణా జిల్లా ఘంటసాలకు చెందిన కనకదుర్గ(36) సింగపూర్ వెళ్లారు. బుధవారం సాయంత్రం తిరిగి చెన్నైకి వచ్చారు. అక్కడి విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు చెకింగ్ చేయగా.. కనకదుర్గది ఫేక్ పాస్‌పోర్ట్ అని తేలింది. వేరే వ్యక్తి పాస్‌పోర్ట్‌లో ఈమె ఫొటో పెట్టి సింగపూర్ వెళ్లినట్లు గుర్తించారు. నాగేశ్వరరావు అనే వ్యక్తి ఈ ఫేక్ పాస్‌పోర్ట్ చేసినట్లు సమాచారం.