News April 25, 2024
పోలవరం అభ్యర్థి కుటుంబానికి 67ఎకరాల భూమి ..!

అభ్యర్థి: తెల్లం రాజ్యలక్ష్మి ( వైసీపీ)విద్యార్హతలు: డిగ్రీ, బీఏ కేసులు: ఏమీ లేవుచరాస్తుల విలువ: రూ.41.61లక్షలు, భర్త బాలరాజు పేరిట: రూ.98.54 లక్షలుబంగారం: 130 గ్రాములు, భర్తకు- 30 గ్రాములుస్థిరాస్తి: 24.10 ఎకరాలు,
భర్తకు 30.74 ఎకరాలు,
కుమారుడి పేరిట-12.38 ఎకరాలు అప్పులు: రూ.25.41 లక్షలు,
భర్తకు రూ.43.27 లక్షలువాహనాలు: భర్త పేరున పార్చ్యునర్ కారు, కుమారుడి పేరిట ఇన్నోవా క్రిస్టా కారు
Similar News
News April 17, 2026
భీమవరం: విభిన్న ప్రతిభావంతుల ప్రత్యేక గ్రీవెన్స్

భీమవరం కలెక్టరేట్‌లో శుక్రవారం విభిన్న ప్రతిభావంతుల కోసం ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహించారు. కలెక్టర్ నాగరాణి బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. ఆమె మాట్లాడుతూ.. మొత్తం 15 అర్జీలు అందాయని, అందులో ప్రధానంగా వైద్య సహాయం, ఉపాధి, రూ.15 వేల పెన్షన్ మంజూరు వంటి అంశాలు ఉన్నాయని తెలిపారు. ఈ సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
News April 17, 2026
ప.గో: లంచావతారాలుగా మారారంటూ రాష్ట్రపతికి ఫిర్యాదు

తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి, ఆయన అనుచరుడు తోట గోపిలు లంచావతారాలుగా మారారని అదే పార్టీకి చెందిన నాయకుడు రవికిరణ్ రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. గోపి కుమారుడు రాజా లంచాల దందా సాగిస్తూ, వీరి దందాను అమరావతిలో కూడా చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఉద్యోగుల బదిలీల్లో వసూళ్లకు పాల్పడుతున్నారని, బాధ్యత కలిగిన వ్యక్తులు ఇలా చేయడం తగదని, చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు.
News April 17, 2026
ప.గో కలెక్టర్ కీలక ఆదేశాలు

పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్స్ ద్వారా భూసంబంధిత సమస్యలను సమర్థవంతంగా పరిష్కరిస్తున్నట్లు కలెక్టర్ నాగరాణి తెలిపారు. 2025 డిసెంబర్ నుంచి ఇప్పటివరకు 13 విడతల్లో ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు. జిల్లావ్యాప్తంగా అందిన 553 దరఖాస్తుల్లో 189 పరిష్కరించామని, మిగిలిన 229 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో అర్జీల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని ఆమె ఆదేశించారు.


