News December 2, 2025
పోలవరం ఆలోపే పూర్తి చేస్తాం: CM

పోలవరం ప్రాజెక్టు రాష్ట్ర ప్రజల చిరకాల వాంఛ అని, ఆ ప్రాజెక్టు మనకు ఓ గేమ్ ఛేంజర్ అవుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అన్నారు. సోమవారం ఉంగుటూరు మండలం నల్లమాడులో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. 2027 నాటికి గోదావరి పుష్కరాలకు ముందే పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామన్నారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంతో గోదావరి, కృష్ణా డెల్టాలో నీటి ఎద్దడి సమస్యే ఉండదన్నారు.
Similar News
News February 13, 2026
KMR: ఆరుగురి హత్య.. నిందితుడికి మరణ శిక్ష

ఆస్తి కోసం స్నేహితుడి కుటుంబాన్నే కడతేర్చిన కిరాతక ఘటనలో కామారెడ్డి న్యాయస్థానం చరిత్రాత్మక తీర్పు వెలువరించినట్లు కామారెడ్డి SP రాజేశ్ చంద్ర పేర్కొన్నారు. ఆరుగురిని అతి దారుణంగా హత్య చేసిన ప్రధాన నిందితుడు మెడిద ప్రశాంత్‌కు మరణశిక్ష విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి వరప్రసాద్ తీర్పునిచ్చారు. మరో ఇద్దరు నిందితులు గుగులోత్ విష్ణు, మెడిద ఒడ్డెమ్మలకు జీవిత ఖైదుతో పాటు జరిమానా విధించారు.
News February 13, 2026
వర్ధన్నపేటలో హంగ్.. BRS 6, కాంగ్రెస్ 5

వర్ధన్నపేట మున్సిపాలిటీలో హంగ్ ఏర్పడింది. ఇక్కడ మొత్తం 12 వార్డులు ఉండగా BRS 6, కాంగ్రెస్ 5, ఇండిపెండెంట్ 1 స్థానంలో గెలిచారు. కాగా మ్యాజిక్ ఫిగర్ సంఖ్య 7 ఏ పార్టీ సాధించకపోవడంతో ఇక్కడ హంగ్ ఏర్పడింది. దీంతో వర్ధన్నపేటలో ఏం జరుగుతుందోనని ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు.
News February 13, 2026
పెద్దపల్లి జిల్లాలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్

పెద్దపల్లి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసింది. రామగుండం కార్పొరేషన్‌తో పాటు పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని మున్సిపాలిటీలను కాంగ్రెస్ గెలిచింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలోని మూడు నియోజకవర్గాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. అదేవిధంగా ఎంపీ నియోజకవర్గాన్ని కూడా గెలిచింది. ప్రస్తుతం రాష్ట్రంలో పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్‌కు కంచుకోటగా మారింది.


