News December 2, 2025

పోలవరం ఆలోపే పూర్తి చేస్తాం: CM

image

పోలవరం ప్రాజెక్టు రాష్ట్ర ప్రజల చిరకాల వాంఛ అని, ఆ ప్రాజెక్టు మనకు ఓ గేమ్ ఛేంజర్ అవుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అన్నారు. సోమవారం ఉంగుటూరు మండలం నల్లమాడులో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. 2027 నాటికి గోదావరి పుష్కరాలకు ముందే పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామన్నారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంతో గోదావరి, కృష్ణా డెల్టాలో నీటి ఎద్దడి సమస్యే ఉండదన్నారు.

Similar News

News February 13, 2026

సమస్యలు తీరే వరకు నా పోస్టులు ఆగవు: కొలికపూడి

image

తిరువూరు నియోజకవర్గంలో రోడ్లు, కనీస వసతుల లేమిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడమే నా లక్ష్యమని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. “నేను అవినీతి చేయను, చేయనివ్వను. ప్రజల కోసం వేసే వాట్సాప్ స్టేటస్‌లు, ట్వీట్లు కొనసాగుతాయి. నాకు ఎవరితోనూ వ్యక్తిగత విభేదాలు లేవు” అని ఆయన పేర్కొన్నారు. సుపరిపాలనలో తిరువూరును అగ్రస్థానంలో నిలుపుతానని అసెంబ్లీ లాబీల్లో మీడియా చిట్‌చాట్‌లో వెల్లడించారు.

News February 13, 2026

ఓట్ల కోసం బోరున ఏడ్చిన BJP అభ్యర్థి.. రిజల్ట్ ఇదే

image

TG: ‘ప్లీజ్ నాకు ఒక్క అవకాశం ఇవ్వండి’ అంటూ <<19103865>>కన్నీళ్లు<<>> పెట్టుకున్న యాదగిరిగుట్ట 9వ వార్డు BJP అభ్యర్థి ఉమ్మగండి రాజమణి ఓడిపోయారు. ‘దేశం కోసం, ధర్మం కోసం పోరాడుతున్న నాకు ఓటెయ్యండి’ అంటూ ఆమె బోరున విలపించిన తీరు సోషల్ మీడియాలో వైరలైన విషయం తెలిసిందే. నేటి ఫలితాల్లో 10 ఓట్లు మాత్రమే వచ్చినా రాజమణి నిరాశ చెందలేదు. డబ్బు, మద్యం తీసుకోకుండా బీజేపీకి ఓటు వేసిన వారికి ధన్యవాదాలు తెలిపారు.

News February 13, 2026

తూ.గో జిల్లాలో ఈనెల 17న డీ-వార్మింగ్ డే- డీఎంహెచ్‌ఓ

image

తూర్పుగోదావరి జిల్లాలోని అంగన్‌వాడీలు, పాఠశాలలు, కళాశాలల్లో ఈ నెల 17న జాతీయ డీ-వార్మింగ్ డే నిర్వహించనున్నట్లు డీఎంహెచ్‌ఓ వెంకటేశ్వరరావు తెలిపారు. ఆ రోజు మాత్రలు వేసుకోలేని వారి కోసం 24న ‘మాప్-అప్ డే’ ఏర్పాటు చేశామన్నారు. వయసును బట్టి ఆల్బెండాజోల్ మాత్రలు పంపిణీ చేస్తామని, పిల్లలకు ఆహారం తిన్న తర్వాతే వీటిని వేయాలని సూచించారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.