News March 28, 2024
పోలీసులకు DGP పథకాలు.. IG పాలరాజుకు గోల్డ్ డిస్క్

పోలీస్ శాఖలో రాష్ట్రస్థాయిలో వివిధ కేసుల్లో అత్యున్నత ప్రతిభ కనబరిచిన వారికి రాష్ట్రప్రభుత్వం డీజీపీ గోల్డ్ డిస్క్, సిల్వర్ డిస్క్, బ్రాంచ్ డిస్క్ అవార్డులకు ఎంపిక చేసింది. వారిలో గుంటూరు రేంజ్ ఐజి పాలరాజుకు గోల్డ్ డిస్క్, ఏఎస్పి సుప్రజ, డీఎస్పీ పోతురాజులకు సిల్వర్ డిస్క్, ఏఎస్పీ A. శ్రీనివాసరావు, డి.ఎస్.పిలు T. శ్రీనివాసరావు, B సీతారామయ్య మరికొందరికి బ్రాంచ్ డిస్క్‌లకు ఎంపికయ్యారు.
Similar News
News February 11, 2026
స్వర్ణాంధ్ర లక్ష్యసాధనకు సమన్వయంతో పనిచేయాలి: కలెక్టర్

స్వర్ణ ఆంధ్ర @ 2047లో భాగంగా సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించడానికి అన్నీ శాఖలు సమన్వయంతో కృషిచేయాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అన్నారు. కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ (KPI) పై వివిధ శాఖల అధికారులకు కలెక్టర్ కార్యాలయంలో బుధవారం శిక్షణా కార్యక్రమం జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ.. కీలక పనితీరు సూచికలను (KPIలు) సాంకేతికత ఆధారిత పనితీరుపై పర్యవేక్షణ జరుగుతుందన్నారు.
News February 11, 2026
సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించాలి: కలెక్టర్

స్వర్ణాంధ్ర @2047లో భాగంగా సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించడానికి కృషి చేయాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అన్నారు. కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్‌పై అధికారులకు కలెక్టరేట్‌లో బుధవారం శిక్షణా కార్యక్రమం జరిగింది. కీలక పనితీరు సూచికలను సాంకేతికత ఆధారిత పనితీరును పర్యవేక్షణ జరుగుతుందన్నారు. ఆర్థిక, సామాజిక కొలమానాలు, లాజిస్టిక్స్, మానిటరింగ్ మెకానిజం అభివృద్ధి చేసుకోవాలన్నారు.
News February 11, 2026
ANU దూరవిద్య పరీక్షల్లో పకడ్బందీ నిఘా

ఆచార్య నాగార్జున వర్సిటీ దూరవిద్య పరీక్షలను పటిష్ఠంగా నిర్వహిస్తున్నట్లు పరీక్షల సమన్వయకర్త రామచంద్రన్ తెలిపారు. పరీక్షల పర్యవేక్షణకు రాష్ట్రవ్యాప్తంగా ఏడు తనిఖీ బృందాలను ఏర్పాటు చేశామన్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని ఓ కేంద్రంలో కాపీయింగ్‌కు పాల్పడుతున్న 9 మంది విద్యార్థులపై మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని విద్యార్థులను హెచ్చరించారు.


