News April 25, 2024
‘పోలీసులు విధినిర్వహణలో బాధ్యతగా ఉండాలి’

పోలీసులు విధినిర్వహణలో చట్టాలపై అవగాహన, బాధ్యతాయుతమైన విధులు చాలా కీలకమని ఎస్పీ సునీల్ దత్ అన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న పోలీస్ కానిస్టేబుళ్లకు పలు అంశాలపై ఆయన అవగాహన కల్పించారు. చట్టాలను అమలు చేయడం, శాంతి సామరస్యాన్ని కాపాడటం, నేర కార్యకలాపాలు కట్టడి చేయడం వంటి కీలకమైన భాధ్యతలు నిర్వహించాల్సిన ట్రైన్ కానిస్టేబుళ్లు పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు.
Similar News
News April 13, 2026
ఖమ్మం: నేటి నుంచే రీకౌంటింగ్ దరఖాస్తులు

ఇంటర్ ఫలితాల్లో ఖమ్మం జిల్లా సత్తా చాటింది. ప్రథమ సంవత్సరంలో 72.06% ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 4వ స్థానంలో, ద్వితీయ సంవత్సరంలో 81.60%తో 6వ స్థానంలో నిలిచింది. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం నేటి నుంచి 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని డీఐఈఓ రవిబాబు తెలిపారు. మే 13 నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. విద్యార్థులు నిరుత్సాహపడకుండా సిద్ధం కావాలని ఆయన సూచించారు.

News April 12, 2026
మధిర: ఇంటర్ రిజల్ట్.. 1000/992 మార్కులు

మధిర మండలం జిలుగుమాడు గ్రామానికి చెందిన దోర్నాల ప్రశాంతి ఇంటర్ ఫలితాల్లో 1000కు 992 మార్కులు సాధించి రాష్ట్రస్థాయి ప్రతిభ కనబరిచింది. మధిరలో పదో తరగతి పూర్తి చేసి, ఖమ్మంలోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ చదివింది. ఆదివారం విడుదలైన ఫలితాల్లో ఈ ఘనత సాధించింది. ప్రశాంతిని కుటుంబ సభ్యులు, అధ్యాపకులు, స్నేహితులు అభినందించారు.