News March 14, 2025

పోలీసుల కస్టడీలో పెద్దపల్లి వాసి అనుమానాస్పద మృతి

image

నిజామాబాద్‌లో పోలీసుల కస్టడీలో ఉన్న ఒక గల్ఫ్ ఏజెంట్ మృతిచెందాడు. బాధిత కుటుంబీకుల ప్రకారం.. JGTL చెందిన చిరంజీవి, PDPLకి చెందిన సంపత్ ఇరువురు కలిసి గల్ఫ్‌కు కొందరిని పంపించారు. తీరా అక్కడికి వెళ్లిన వారికి పనిలేకపోవడంతో వారు తిరిగొచ్చి సంపత్, చిరంజీవిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు ద్వారా 2రోజుల క్రితం కస్టడీలోకి తీసుకోగా సంపత్ మృతిచెందాడు.

Similar News

News February 16, 2026

మొక్కజొన్న: ఎరువుల యాజమాన్యం, తెగుళ్ల నివారణ

image

☛ పూత దశలో మొక్కజొన్న పంటకు 50KGల యూరియా, 20KGల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులను వేసి, నీటి తడిని ఇవ్వాలి. ☛ పేను బంక ఆశిస్తే డైమిథోయేట్ 30EC 2 ML లీటరు నీటికి, ఆకుమచ్చ, ఆకు మాడు తెగుళ్లు ఆశిస్తే 2.5గ్రా. మ్యాంకోజెబ్/1మి.లీ ప్రొపికొనజోల్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ☛ కాండం కుళ్లు తెగులు కనిపిస్తే 100KGల వేప పిండి, 4KGల 35% క్లోరిన్ కలిగిన బ్లీచింగ్ పౌడర్‌ను కలిపి మొక్కల మొదళ్ల దగ్గర వేయాలి.

News February 16, 2026

10వ తరగతి అర్హతతో ఉద్యోగాలు.. నేడే లాస్ట్

image

తపాలా శాఖలో గ్రామీణ డాక్ సేవక్ ఖాళీల భర్తీకి నెల క్రితం నోటిఫికేషన్ విడుదల కాగా దరఖాస్తుకు నేడు చివరి తేదీ. పదో తరగతి మార్కుల మెరిట్‌తో వీటిని భర్తీ చేయనున్నారు. అనంతపురం డివిజన్‌లో 46, హిందూపురం డివిజన్‌లో 31 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి ఉన్నవారు నేటి సాయంత్రంలోగా indiapost.gov.inలో అప్లై చేయాలి.
వేతనం వివరాలు:
☞ బీపీఎం పోస్టులకు నెలకు రూ.12,000-29,380
☞ ఏబీపీఎం/ డాక్ సేవక్ పోస్టులకు రూ.10,000- 24,470

News February 16, 2026

మిల్క్ బ్యాంక్ గురించి తెలుసా?

image

మిల్క్ బ్యాంక్ తల్లి పాల దాతల నుండి పాలను సేకరిస్తుంది. ప్రసవానంతర మహిళలు వారి బిడ్డలకు పాలు ఇవ్వగా, మిగిలిన పాలను మిల్క్ బ్యాంక్‌లో డొనేట్ చేస్తారు. ఫార్ములా పాలతో పోల్చి చూస్తే పాశ్చరైజ్డ్ డోనర్ పాల కు పోషక విలువలు ఎక్కువ. ముందుగా పాలల్లో సూక్ష్మ క్రిములు ఉన్నాయేమో చెక్ చేసి తర్వాత పాలను పాశ్చరైజ్ చేసి, నిల్వ చేస్తారు. తల్లిపాలు లభ్యంకాని శిశువులకు డోనర్ పాలను మిల్క్ బ్యాంక్ పంపిణీ చేస్తుంది.