News November 7, 2025

పోలీస్ కార్యాలయంలో వందేమాతరం గీతాలాపన

image

వందేమాతరం గీతం రచించి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆధ్వర్యంలో శుక్రవారం గీతాలాపన కార్యక్రమం జరిగింది. పోలీస్ అధికారులు, సిబ్బందితో కలిసి ఎస్పీ పూర్తిస్థాయి వందేమాతరం గీతాన్ని ఆలపించారు. 1875 నవంబర్ 7న బంకిం చంద్ర ఛటర్జీ ఈ గీతాన్ని రచించారని ఎస్పీ ఈ సందర్భంగా తెలిపారు.

Similar News

News January 17, 2026

నల్గొండ: మునిసి’పోల్స్ ‘కు ముందస్తు ప్రచారం!

image

మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్‌ వెలువడకముందే ఆశావహులు ఓటర్ల తలుపు తడుతున్నారు. ఎన్నికల బరిలో నిలవడానికి రెడీ అయిన వారిలో చాలామంది వారం, పది రోజులుగా నల్గొండతో పాటు MLG పట్టణంలోని గల్లీల్లో తిరుగుతున్నారు. ఇంటింటికీ వెళ్లి ఆప్యాయంగా పలకరిస్తున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ఆరాట పడుతున్నారు. ఎన్నికల బరిలో దిగేందుకు ఉత్సాహం చూపుతున్న కొందరు కొంతకాలంగా వార్డుల్లో సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు.

News January 17, 2026

NLG: రైతులకు మళ్లీ మొండి చేయేనా!

image

సంక్రాంతికి రైతు భరోసా ఇస్తామని ఊరించిన ప్రభుత్వం.. ఇప్పటివరకు స్పందించకపోవడంతో రైతులు నిరాశ చెందుతున్నారు. ఈ యాసంగిలో జిల్లాలో 6.57 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేస్తారని వ్యవసాయ శాఖ అంచనాలు వేసింది. సంక్రాంతికి రైతు భరోసా విడుదల చేస్తామని ఇటీవల ప్రకటించిన ప్రభుత్వం ఆచరణలో మొండి చేయి చూపించడంతో రైతులు నిరాశ చెందుతున్నారు. దీంతో అప్పుల కోసం రైతులు ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు.

News January 17, 2026

NLG: మున్సిపాలిటీల్లో ఆధిపత్యం ఆమెదే!

image

మున్సిపల్ ఎన్నికల్లో జిల్లాలో గెలుపోటములు నిర్ణయించే కీలక భూమికను మహిళలు పోషించనున్నారు. ఇటీవల ప్రకటించిన మున్సిపాలిటీ ఓటర్ల తుది జాబితాలో పురుషులకంటే 21,014 మంది మహిళలు అధికంగా ఉన్నారు. ఇక జిల్లాలోని మెజార్టీ మున్సిపాలిటీలో మహిళా ఓటర్లే అధికంగా ఉండటం గమనార్హం. కాంగ్రెస్ మహిళలకు సంక్షేమ పథకాల పేరిట పెద్దపీట వేస్తూ ప్రచారానికి సిద్ధమవుతుండగా BRS, BJP సైతం మహిళలను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతున్నాయి.