News August 14, 2025
పోలీస్ పరేడ్ ఘనంగా నిర్వహించాలి: ఎస్పీ

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నిర్వహించనున్న పోలీస్ పరేడ్‌ను ఘనంగా నిర్వహించాలని ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి ఆదేశించారు. గురువారం ట్రయల్ రన్‌లో భాగంగా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్‌తో కలిసి ఆయన పరేడ్‌ను పరిశీలించారు. శుక్రవారం జరగనున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్క పోలీస్ అధికారి తగు చర్యలు తీసుకోవాలని ఎస్పీ సూచించారు. కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.
Similar News
News March 13, 2026
తాగునీటి పథకానికి రూ.602 కోట్లు మంజూరు: మంత్రి

ఎన్నికలలో ఇచ్చిన హామీలో భాగంగా టెక్కలి నియోజకవర్గంలో ఉన్న 4 మండలాలకు తాగునీటి కోసం రూ.602 కోట్లు మంజూరైనట్లు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. తాడేపల్లిలో నేడు జరిగిన మంత్రివర్గ సమావేశంలో డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిధులు మంజూరు చేశారని ఆయన తెలిపారు. దీంతో ఈ నియోజకవర్గ ప్రజల దాహార్తి పూర్తిగా తీర్చేందుకు ఈ నిధులు వినియోగిస్తామని అన్నారు.
News March 13, 2026
శ్రీకాకుళం: జనాభా ఆధారంగా పంచాయితీల విభజన!

ఏప్రిల్ 2వ తేదీతో పంచాయతీ సర్పంచులు పదవీకాలం ముగుస్తుంది. సకాలంలో ఎన్నికలు జరగకపోయినా, కొన్ని నెలల్లో నిర్వహించేలా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. శ్రీకాకుళం జిల్లాలో ప్రస్తుతం 912 పంచాయతీలు ఉండగా, కొత్త పంచాయతీలు పెరిగే అవకాశం ఉంది. ప్రధానంగా 10 వేలు జనాభా దాటిన గ్రామాలను రూర్బన్, 10,000 లోపు గ్రామాలను గ్రేడు -1, జనాభా 2000 లోపు ఉంటే గ్రేడ్ -2 విభజన జాబితా కసరత్తు చేస్తున్నారు.
News March 13, 2026
శ్రీకాకుళం జిల్లాలో మెదటి సారి కిడ్నీ మార్పిడి చికిత్స

పలాస కిడ్నీ రీసెర్చ్ ఆసుపత్రిలో నేడు మొట్టమొదటి కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సను విశాఖకు చెందిన వైద్య బృందం చేయనున్నారు. కూటమి అధికారంలోకి వచ్చి సుమారు రూ. 12 కోట్ల నిధులతో అత్యాధునిక పరికరాలు, అర్హత కలిగిన వైద్యులను నియమించి ప్రతి రోజు ఉచితంగా డయాలసిస్‌ను అందిస్తోంది. ఈ నేపథ్యంలో సోంపేటకు చెందిన యువతి హేమశ్రీకి మొదటి కిడ్నీ మార్పిడి చికిత్స నేడు జరగనుందని MLA శిరీష ఓ ప్రకటనలో తెలిపారు.


