News April 20, 2024

పోస్టల్ బ్యాలెట్‌ను సద్వినియోగంచేసుకోవాలి: శివశంకర్ 

image

ఏ ప్రభుత్వ ఉద్యోగి ఓటు హక్కు మిస్ అవ్వకుండా సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి శివశంకర్ కోరారు. ఈ సందర్భంగా ఆయన శుక్రవారం కలెక్టరేట్‌లో అత్యవసర శాఖల పోస్టల్ బ్యాలెట్ వినియోగంపై సమావేశం నిర్వహించారు. ఎన్నికల విధులలో ప్రజా రవాణాకు ఇబ్బంది కలగకుండా బస్సులను ఉపయోగించుకోవాలని సూచించారు. వచ్చే నెల 5,6,7 తేదీలలో పోస్టల్ బ్యాలెట్‌ను సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. 

Similar News

News December 11, 2025

గుంటూరు కలెక్టర్‌కు సీఎం ఇచ్చిన ర్యాంక్ ఎంతంటే.!

image

గుంటూరు కలెక్టర్‌గా తమీమ్ అన్సారియా ఇటీవల బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. తనదైన శైలిలో పనిచేస్తూ ఎప్పటికప్పుడు ఫైల్స్ క్లియర్ చేస్తున్నారు. బాధ్యతలు చేపట్టాక ఆమె 816 ఫైల్స్ స్వీకరించారు. ఇందులో 770 ఫైల్స్ క్లియర్ చేశారు. ఒక్కో ఫైల్‌ను సుమారు 35 గంటలు వ్యవధిలోనే క్లియర్ చేయడంతో ఆమెకు సీఎం చంద్రబాబు రాష్ట్రంలో 8వ ర్యాంక్ కేటాయించారు.

News December 10, 2025

GNT: సీఐపై నిందారోపణ కేసులో ట్విస్ట్

image

సీఐ తనపై దాడి చేయించారంటూ నిందలు మోపిన జర్నలిస్ట్ కన్నెగంటి అరుణ్ బాబు సహా మరో ఇద్దరిని పట్టాభిపురం పోలీసులు అరెస్ట్ చేశారు. రౌడీలను పెట్టుకుని తన కారును తానే ధ్వంసం చేయించి, పోలీసులపై అబద్ధపు ఫిర్యాదు చేసినట్లు విచారణలో తేలింది. విజయవాడ బస్టాండ్ వద్ద అరుణ్ బాబు, పొంగులూరి అన్వేష్, కారుకుట్ల సుధీర్ కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. మీడియా ముసుగులో బెదిరింపులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు.

News December 10, 2025

గుంటూరు జిల్లాలో 4.78 లక్షల సంతకాలు

image

మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన సంతకాల సేకరణ ముగిసింది. జిల్లాలోని 7 నియోజకవర్గాల నుంచి మొత్తం 4,78,000 సంతకాలు సేకరించినట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. సేకరించిన సంతకాల పత్రాలను జిల్లా పార్టీ కార్యాలయానికి అందజేశారు. కార్యక్రమంలో పలువురు వైసీపీ ముఖ్యనాయకులు పాల్గొన్నారు.