News March 31, 2024

పోస్టల్ బ్యాలెట్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి:

image

సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి విధుల్లో పాల్గొనే 33 శాఖలకు చెందిన వారికి కేంద్ర ఎన్నికల సంఘం పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని కల్పిస్తుందని కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. విధుల్లో ఉంటూ ఓటు వేయలేని వారు పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకోవాలన్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా నోడల్ అధికారులను నియమించారన్నారు.

Similar News

News February 19, 2026

కర్నూలు: ప్రేమ విషయమై గొడవ.. బలవన్మరణం

image

ఆదోని అరుణ్ జ్యోతి నగర్ కాలనీకి చెందిన మహేశ్(20) <<19174453>>బలవన్మరణానికి<<>> పాల్పడిన విషయం తెలిసిందే. ‘మహేశ్ బేల్దారి పనిచేస్తూ జీవనం సాగించేవాడు. ఈ క్రమంలో ఓ యువతిని ప్రేమించాడు. తననే పెళ్లి చేసుకుంటానని ఇంట్లో చెప్పడంతో ఈ విషయమై గొడవ జరిగింది. దీంతో క్షణికావేశానికి లోనై మేడపై ఇంట్లో ఉరేసుకొన్నాడు. ఆదోని ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు’ అని మూడో పట్టణ ఎస్ఐ రామస్వామి తెలిపారు.

News February 19, 2026

కర్నూలు: రేపే ఇంటర్వ్యూ.. జీతం రూ.20 వేలు

image

ఆలూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈనెల 20న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఆనంద్ రాజ్ కుమార్ తెలిపారు. ఆసక్తి గల నిరుద్యోగులు కళాశాల ఆడిటోరియంలో ఉదయం 10 గంటలకు జరిగే ఇంటర్వ్యూలకు హాజరు కావాలన్నారు. 11 కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారన్నారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ చదివి, 18-35 ఏళ్ల వయసు గల అభ్యర్థులు అర్హులన్నారు. నెలకు రూ.10 నుంచి రూ.20 వేల వరకు జీతం ఉంటుందని తెలిపారు.

News February 19, 2026

హౌసింగ్ సమస్యలపై ‘ఫోన్-ఇన్’ కార్యక్రమం

image

కర్నూలు జిల్లాలో గృహ నిర్మాణ లబ్ధిదారుల సందేహాల నివృత్తి కోసం ప్రత్యేక ఫోన్-ఇన్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు హౌసింగ్ పీడీ చిరంజీవి తెలిపారు. సిమెంట్, స్టీల్ సరఫరా, నిర్మాణ బిల్లులు మరియు PMAY 2.0 Urban ఇళ్లకు సంబంధించిన వివరాల కోసం ప్రతి గురువారం ఉదయం 10:00 నుంచి 11:00 గంటల వరకు సంప్రదించవచ్చని పేర్కొన్నారు.
★ సంప్రదించాల్సిన నంబర్: 08518-257481