News April 22, 2024

ప్రకాశం అబ్బాయి.. జపాన్ అమ్మాయి 

image

ఇద్దరు మనుషులు కలిసి జీవించడానికి దేశాలు, భాషలు, ప్రాంతాలు, ఆచారాలు అడ్డు కావని ఓ ప్రేమ జంట రుజువు చేసింది. ఆదివారం ఈ తరహా వివాహమే జరిగింది. కొరిసపాడు మండలం మేదరమెట్లకు చెందిన ముప్పాళ్ల రాజా జపాన్‌లోని టోక్యో నగరంలో ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అదే నగరంలో నివసిస్తున్న షిహో అనే యువతితో పరిచయం ఏర్పడింది. పెద్దల అంగీకారంతో టీటీడీ కళ్యాణ మండపంలో వారిద్దరి వివాహం జరిగింది.

Similar News

News December 14, 2025

ప్రకాశంలో నవోదయకు పరీక్షకు 1998 మంది గైర్హాజరు

image

ప్రకాశం జిల్లాలో శనివారం నిర్వహించిన నవోదయ ప్రవేశ పరీక్షకు 1998 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ఒంగోలు నవోదయ ప్రిన్సిపాల్ శివరాం తెలిపారు. ఒంగోలులోని నవోదయ విద్యాలయ వద్ద ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో నవోదయ ఆరో తరగతి ప్రవేశపరీక్ష పకడ్బందీగా నిర్వహించామన్నారు. మొత్తం 5,502 మంది విద్యార్థులకు గాను, 3,504మంది విద్యార్థులు పరీక్షకు హాజరైనట్లు తెలిపారు.

News December 13, 2025

ఈ ఒంగోలు అమ్మాయి చాలా గ్రేట్..!

image

ఒంగోలుకు చెందిన PVR గర్ల్స్ హైస్కూల్ 9వ తరగతి విద్యార్థిని ఆముక్త తన ప్రతిభతో సత్తాచాటింది. జర్మనీలో నిర్వహించిన అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్‌లో తన తొలి ఓపెన్ మహిళా ఇంటర్నేషనల్ మాస్టర్ నార్మ్ సాధించింది. 13 ఏళ్ల వయసులోనే మహిళ పైడే మాస్టర్ టైటిల్ పొందిన ఆముక్తను కలెక్టర్ రాజాబాబు ప్రత్యేకంగా అభినందించి సత్కరించారు.