News August 11, 2025
ప్రకాశం ఎస్పీ మీ కోసంకు 52 ఫిర్యాదులు

ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ఎస్పీ మీ కోసం కార్యక్రమానికి 52 ఫిర్యాదులు అందినట్లు ఎస్పీ కార్యాలయం ప్రకటించింది. ఎస్పీ దామోదర్ అధ్వర్యంలో సాగిన మీకోసం కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి ఫిర్యాదుదారులు వచ్చారు. సమస్యలను ఎస్పీ స్వయంగా అడిగి తెలుసుకుని, మీ కోసం ఫిర్యాదులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులను ఆదేశించారు.
Similar News
News March 7, 2026
సంతనూతలపాడు వద్ద రోడ్డు ప్రమాదం

సంతనూతలపాడు ఎండ్లూరు డొంక వద్ద శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. భారీ గ్రానైట్ రాళ్లతో వెళ్తున్న లారీ ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటో ముందు భాగం దెబ్బ తిన్నది. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.
News March 7, 2026
3000 మందితో మహిళా దినోత్సవ వేడుకలు: JC

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మార్చి 8వ తేదీ ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని మార్కాపురం జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు అధికారులు ఆదేశించారు. మార్కాపురం జిల్లా కలెక్టరేట్లో అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. 3000 మందితో మహిళా దినోత్సవ వేడుకలను జరుపుతున్నామన్నారు. దానికి అనుగుణంగా మెప్మా, ఐసీడీఎస్ శాఖల సిబ్బందితో సమన్వయం చేసుకోవాలన్నారు.
News March 6, 2026
కొత్తపట్నంలో ఉరివేసుకొని వ్యక్తి మృతి

కొత్తపట్నం మండలం కే పల్లిపాలెం తుఫాన్ బిల్డింగ్ వద్ద శుక్రవారం ఉదయం చెట్టుకు ఉరివేసుకొని వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు మృతుడు పెదగంజం గ్రామానికి చెందిన పాలేటి గోపి (29)గా గుర్తించారు. విషయం తెలుసుకున్న స్థానిక SI వేముల సుధాకర్ ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఒంగోలు రిమ్స్‌కి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని SI తెలిపారు.


