News November 12, 2024
ప్రకాశం: ఒకేరోజు ముగ్గురు పోలీసుల మృతి
ప్రకాశం జిల్లాలో సోమవారం విషాద ఘటనలు జరిగాయి. గతంలో నారా భువనేశ్వరికి సపోర్టుగా నిలిచిన హెడ్ కానిస్టేబుల్ <<14584058>>విజయకృష్ణ<<>> గుండెపోటుతో కన్నుమూశారు. మార్కాపురం(M) కొట్టాపల్లికి చెందిన కానిస్టేబుల్ <<14580513>>వేముల మస్తాన్<<>> భార్యతో గొడవపడి ఉరేసుకున్నారు. ఒంగోలు మహిళా పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ చలపతిరావు అనారోగ్యానికి గురయ్యారు. HYDకు తరలిస్తుండగా మేదరమెట్ల వద్ద గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు.
Similar News
News December 6, 2024
కొత్తపట్నం బీచ్ వద్ద చిన్న సైజు విమానం
కొత్తపట్నం తీరప్రాంతంలో చిన్న సైజులో ఉన్న గల ఓ విమానాన్ని మెరైన్ పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుల వలలో ఈ పరికరం పడింది. విషయం తెలుసుకున్న మెరైన్ సీఐ, ఎస్సైలు గస్తీ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో హెడ్ కానిస్టేబుల్ రాజు, రామిరెడ్డి, హోంగార్డు లక్ష్మణ్‌లు తీరానికి వెళ్లి మత్స్యకారుల నుంచి ఆ పరికరాన్ని స్వాధీనం చేసుకున్నారు.
News December 5, 2024
ప్రకాశం: కరెంట్ షాక్‌తో ఇద్దరు యువకుల మృతి
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో గురువారం తీవ్ర విషాద ఘటన జరిగింది. కొనకనమిట్ల మండలం సిద్దవరం శివారులోని నిమ్మతోటలో విద్యుత్ లైన్లు లాగుతుండగా కరెంట్ షాక్ తగిలింది. ఈ ఘటనలో ఇద్దరు కూలీలు చనిపోయారు. మృతులు పెద్దారవీడుకు చెందిన నాగరాజు (28), రంగారావు(30)గా గుర్తించారు. విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వకుండా పనులు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.
News December 5, 2024
ప్రకాశం: సంచలనమైన సర్పంచ్ హత్యకేసు కొట్టివేత
2016లో సంచలనమైన సంతమాగులూరు గ్రామ సర్పంచ్ గడ్డం వెంకటరెడ్డి హత్యకేసులో బుధవారం ఒంగోలు న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. 8 సంవత్సరాలకు పైన న్యాయస్థానంలో విచారణ జరిగిన ఈ కేసులో నేర ఆరోపణకు సంబంధించి సరైన సాక్ష్యాలు లేకపోవడంతో ఒంగోలు సెషన్స్ న్యాయస్థానం న్యాయమూర్తి టి. రాజావెంకటాద్రి సెక్షన్ 235(1) కింద కేసును కొట్టి వేస్తున్నట్లు తీర్పు వెలువరించింది.