News June 20, 2024

ప్రకాశం: గంజాయి నిర్మూలనపై వంద రోజుల ప్రణాళిక

image

జిల్లాలో మాదక ద్రవ్యాలు, ముఖ్యంగా గంజాయిని నిర్మూలించేందుకు వంద రోజుల కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేశామని జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. బాధితులకు పునరావాసం కల్పించడంపై ప్రత్యేక దృష్టి పెట్టామని చెప్పారు. వంద రోజుల్లో స్పష్టమైన మార్పు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మహిళ భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు.

Similar News

News January 21, 2026

మార్కాపురం జిల్లాలో దారుణ హత్య.!

image

మార్కాపురం జిల్లాలో బుధవారం రాత్రి దారుణ హత్య జరిగింది. పెద్దారవీడు మండలం బద్వీడు చెర్లోపల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది. లాలూ అనే వ్యక్తిని భార్య, బావమరిది కత్తులతో పొడిచి చంపినట్లు సమాచారం. హత్య చేసిన అనంతరం రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పెద్దారవీడు పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి, నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News January 21, 2026

జనవరి చివరి వారంలో వెలిగొండకు CM.!

image

ఈనెల 23 ఉదయం 9గంటలకు మంత్రి నిమ్మల రామానాయుడు వెలిగొండ ప్రాజెక్టు టన్నెల్, ఫీడర్ కెనాల్ పనులను పరిశీలించనున్నారు. మంత్రి కార్యాలయం బుధవారం ఈ ప్రకటన విడుదల చేసింది. ఈనెల చివరి వారంలో CM చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టు సందర్శించి ఫీడర్ కెనాల్ రిటైనింగ్ వాల్ పనులకు భూమిపూజ చేయనున్నాట్లు సమాచారం. దీనిపై మంత్రి ముందస్తు ఏర్పాట్లను చేయనున్నట్లు వెళ్తున్నారు.

News January 21, 2026

23న వెలిగొండకు మంత్రి నిమ్మల.. నెలాఖరుకు CM

image

ఈనెల 23 ఉదయం 9గంటలకు మంత్రి నిమ్మల రామానాయుడు వెలిగొండ ప్రాజెక్టు టన్నెల్, ఫీడర్ కెనాల్ పనులను పరిశీలించనున్నారు. మంత్రి కార్యాలయం బుధవారం ఈ ప్రకటన విడుదల చేసింది. ఈనెల చివరి వారంలో CM చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టు సందర్శించి ఫీడర్ కెనాల్ రిటైనింగ్ వాల్ పనులకు భూమిపూజ చేయనున్నాట్లు సమాచారం. దీనిపై మంత్రి ముందస్తు ఏర్పాట్లను చూసేందుకు వెళ్తున్నారు.