News October 5, 2025

ప్రకాశం జిల్లాకు భారీ వర్ష సూచన

image

రానున్న మూడు గంటల్లో ప్రకాశం జిల్లా వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ ప్రకృతి విపత్తుల నిర్వహణ సంస్థ తాజాగా ప్రకటించింది. ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించగా, ప్రకాశం జిల్లాను ఆరెంజ్ అలర్ట్ జోన్‌గా అధికారులు ప్రకటించారు. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు తగిన జాగ్రత్త వహించాలని అధికారులు సూచించారు.

Similar News

News January 18, 2026

ప్రకాశం: ఫుల్‌గా తాగేశారు..!

image

ప్రకాశం జిల్లాలో సంక్రాంతి ఘనంగా జరిగింది. పండగల్లో మద్యం ప్రియులు తమ సత్తా చూపారు. 14వ తేదీ ఒక్కరోజే రూ.5.82 కోట్ల విలువైన మద్యం గౌడౌన్ నుంచి షాపులకు తరలింది. 15, 16వ తేదీల్లో గోడౌన్లకు సెలవు కావడంతో ముందుగా మద్యం షాపుల ఓనర్లు భారీగా మద్యం తీసుకు వచ్చారు. ఈనెల పదో తేదీ నుంచి 14వ తేదీ వరకు సుమారు రూ.23 కోట్ల వ్యాపారం జరిగినట్లు అధికారుల సమాచారం.

News January 18, 2026

ఇవాళ ప్రకాశం జిల్లాకు రానున్న ఇన్‌ఛార్జ్ మంత్రి

image

ప్రకాశం జిల్లా పర్యటన నిమిత్తం జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆదివారం రానున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఒంగోలులో జరిగే నందమూరి తారక రామారావు వర్ధంతి కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఇదే కార్యక్రమంలో జిల్లాకు చెందిన మంత్రి స్వామి, పలువురు ఎమ్మెల్యేలు సైతం పాల్గొననున్నారు.