News March 12, 2025

ప్రకాశం జిల్లాకు 57 నూతన ప్రభుత్వ పాఠశాలలు

image

ప్రకాశం జిల్లాలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి నూతనంగా 57 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలను నెలకొల్పుతున్నట్లుగా, విద్యాశాఖ ప్రతిపాదనలు పంపగా జిల్లా కలెక్టర్ వాటిని ఆమోదించారు. మరో నెల రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుందని ఉన్నతాధికారులు వెల్లడించారు. కాగా ఇప్పటికే ఎంఈఓలు, డిప్యూటీ ఈఓలు నివేదికను తీసుకొని ఎక్కడెక్కడ పాఠశాలలను నెలకొల్పాలో, ఓ అంచనాతో విద్యాశాఖ నివేదిక రూపంలో వాటిని అధికారులకు సమర్పించనున్నారు.

Similar News

News January 23, 2026

కందుకూరు LICలో రూ.3 కోట్ల స్కాం.!

image

కందుకూరు LICలో భారీ స్కాం బయటపడింది. పూర్వాశ్రమంలో ఏజెంట్‌గా ఉండి తర్వాత డెవలప్మెంట్ ఆఫీసర్‌గా మారిన పూజల శ్రీనివాస్ పథకం ప్రకారం స్కాంకు పాల్పడ్డాడు. దొంగ పాలసీలు చేయించి నకిలీ డెత్ సర్టిఫికెట్లతో రూ.3 కోట్లు కాజేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. కొత్త సాప్ట్‌వేర్‌తో ఈ స్కాం గుట్టు రట్టయినట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News January 23, 2026

ప్రకాశం: రూ.144 చెల్లిస్తే కొండంత భరోసా..!

image

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పాడి రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం రాయితీతో కూడిన బీమాను ఈనెల 19నుంచి అమల్లోకి తెచ్చింది. కేవలం 15% చెల్లింపుతో ఆవు, గేదె, గొర్రె, మేకలు చనిపోతే పాడిరైతు ఖాతాలో నగదు జమవుతోంది. ఈనెల 31వరకు జరుగే పశుఆరోగ్య శిబిరాల్లో నమోదు చేసుకోవాలి. మేలుజాతి ఆవులు, గేదెలు ఒక్కోదానికి మూడేళ్లకు రూ.288, నాటుజాతి పశువులకు మూడేళ్లకు రూ.144, గొర్రెలు, మేకలకు మూడేళ్ల కాలానికి రూ.56 చెల్లించాలి.

News January 23, 2026

ఒంగోలు మీదుగా అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్..!

image

దక్షిణ మధ్య రైల్వే పరిధిలో కొత్తగా తాంబరం–సంత్రాగాచి–తాంబరం అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ (16107/16108) వారానికి ఒకసారి నడవనుంది. జనవరి 23 నుంచి తాంబరం నుంచి, జనవరి 24 నుంచి సంత్రాగాచి నుంచి సేవలు ప్రారంభం కానున్నాయి. ఈ రైలు ఒంగోలు మీదుగా ప్రయాణించనుంది. ప్రయాణికులకు వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణం అందించనుందని రైల్వే వర్గాలు పేర్కొన్నాయి.