News November 30, 2025
ప్రకాశం జిల్లాలో ఆ 14 మండలాలపై దిత్వా తుఫాన్ ప్రభావం

ప్రకాశం జిల్లాలోని 14 మండలాలు, 168 గ్రామాల్లో దిత్వా తుఫాను ప్రభావం ఉండే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ రాజాబాబు అన్నారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయం నుంచి ఆదివారం మండల స్థాయి అధికారులతో కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. తుఫాను హెచ్చరిక నేపథ్యంలో అధికారులందరూ ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలోని చెరువుల వద్ద క్షేత్రస్థాయి సిబ్బంది పరిస్థితిని గమనించాలన్నారు.
Similar News
News February 8, 2026
మార్కాపురం: పలకల క్వారీ గుంతలో పడి విద్యార్థి మృతి

మార్కాపురం మండలం రాయవరం గ్రామ సమీపంలోని పలకల క్వారీలో సరదాగా ఈత కొట్టడానికి వెళ్లిన ముగ్గురు విద్యార్థులలో ఒక విద్యార్థి గల్లంతయ్యాడు. మిగిలిన విద్యార్థులు భయపడి రోడ్డుపై వెళ్తున్న వారిని పిలిచి విషయం చెప్పడంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని 9వ తరగతి చదువుతున్న విద్యార్థి ఏసుబాబు మృతదేహాన్ని బయటకు తీశారు.
News February 8, 2026
వైఎస్ జగన్‌ను కలిసిన ఒంగోలు ఎంపీ మాగుంట

చెన్నైలో మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంబ సభ్యుల వివాహం జరిగింది. ఈ కార్యక్రమంలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైస్ జగన్ మోహన్ రెడ్డి, మాగుంట ఇరువురూ పలకరించుకున్నారు. మాగుంటను జగన్ ఆప్యాయంగా పలకరించి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ భేటీలో రాజకీయాలు ఏమి లేవని సమాచారం.
News February 8, 2026
పాకల బీచ్ ఫెస్టివల్ కు రానున్న ప్రముఖ యాంకర్

సింగరాయకొండ మండలం పాకల బీచ్ వద్ద ఈనెల 14, 15వ తేదీలలో జరగనున్న బీచ్ ఫెస్టివల్‌కు ప్రముఖ యాంకర్ సుమ రానున్నారు. ఇదే విషయాన్ని మంత్రి స్వామి సైతం వెల్లడించారు. రెండు రోజులపాటు ఘనంగా నిర్వహించే ఫెస్టివల్‌కు పలువురు కమెడియన్లు సైతం రానున్నారు. ప్రతిష్ఠాత్మకంగా బీచ్ ఫెస్టివల్ నిర్వహించనున్న నేపథ్యంలో ఇక్కడ నిర్వహించే కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకోనున్నాయి.


