News June 19, 2024
ప్రకాశం జిల్లాలో 2.42 లక్షల మందికి పీఎం కిసాన్

పీఎం కిసాన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న ఆర్థిక సాయాన్ని మంగళవారం జమ చేసినట్లు ప్రకాశం జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాసరావు తెలిపారు. 17 వ విడతగా విడుదల చేసిన సాయం జిల్లాలో 2.42 లక్షల మంది రైతులకు రూ. 48.43 కోట్లు విడుదల అయినట్లు ఆయన పేర్కొన్నారు. డీబీటీ పద్ధతిలో ఒక్కో రైతుకు బ్యాంకు ఖాతాలోకి రూ.2వేలు జమ చేశారని, ఇది పెట్టుబడి సాయంగా ఉపయోగపడుతుందని తెలిపారు.
Similar News
News January 21, 2026
జనవరి చివరి వారంలో వెలిగొండకు CM.!

ఈనెల 23 ఉదయం 9గంటలకు మంత్రి నిమ్మల రామానాయుడు వెలిగొండ ప్రాజెక్టు టన్నెల్, ఫీడర్ కెనాల్ పనులను పరిశీలించనున్నారు. మంత్రి కార్యాలయం బుధవారం ఈ ప్రకటన విడుదల చేసింది. ఈనెల చివరి వారంలో CM చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టు సందర్శించి ఫీడర్ కెనాల్ రిటైనింగ్ వాల్ పనులకు భూమిపూజ చేయనున్నాట్లు సమాచారం. దీనిపై మంత్రి ముందస్తు ఏర్పాట్లను చేయనున్నట్లు వెళ్తున్నారు.
News January 21, 2026
23న వెలిగొండకు మంత్రి నిమ్మల.. నెలాఖరుకు CM

ఈనెల 23 ఉదయం 9గంటలకు మంత్రి నిమ్మల రామానాయుడు వెలిగొండ ప్రాజెక్టు టన్నెల్, ఫీడర్ కెనాల్ పనులను పరిశీలించనున్నారు. మంత్రి కార్యాలయం బుధవారం ఈ ప్రకటన విడుదల చేసింది. ఈనెల చివరి వారంలో CM చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టు సందర్శించి ఫీడర్ కెనాల్ రిటైనింగ్ వాల్ పనులకు భూమిపూజ చేయనున్నాట్లు సమాచారం. దీనిపై మంత్రి ముందస్తు ఏర్పాట్లను చూసేందుకు వెళ్తున్నారు.
News January 21, 2026
ప్రకాశం: గీతిక.. నువ్వు సూపర్!

ప్రకాశం జిల్లా కొండపి మండలం జాల్లపాలెం పాఠశాల విద్యార్థిని రాసిన పుస్తకానికి రాష్ట్రస్థాయిలో గుర్తింపు దక్కింది. హెచ్ఎం మంచికల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. 10వ తరగతి చదువుతున్న గీతిక 8వ తరగతిలో రాసిన కథలు, కవితలతో కూడిన పుస్తకాన్ని ‘వేదన’ పేరిట ప్రచురించారు. రచనవి భాగంలో పాఠశాల గ్రంథాలయాలకు దీపిక రాసిన పుస్తకం ఎంపికైనట్లు HM చెప్పారు.


