News August 13, 2025
ప్రకాశం: తుఫాన్ ఎఫెక్ట్.. కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

రాబోయే మూడు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు చేపట్టినట్లు ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. బుధవారం తహశీల్దార్లతో నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడారు. తుఫాన్ కారణంగా ఏమైనా సమస్యలు ఎదురైతే, కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నంబర్ 1077కు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు.
Similar News
News March 17, 2026
ప్రకాశం: బాలికపై అత్యాచారం.. నిందితుడికి 20 ఏళ్ల జైలు

10 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన వ్యక్తికి ఒంగోలు పోక్సో కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష, జరిమానా విధించింది. బేస్తవారిపేట(M) పూసలపాడుకు చెందిన మోతుకూరి కోలా పిచ్చయ్య(31)పై కేసు నమోదై దర్యాప్తు దర్వాప్తు నేరం రుజువైంది. ఈ సందర్భంగా బాధితురాలికి రూ.3 లక్షల పరిహారం ఇవ్వాలని కోర్టు ఆదేశించినట్లు SP తెలిపారు. ముద్దాయికి శిక్ష పడడంలో కృషి చేసిన పోలీసులను SP అభినందించారు.
News March 17, 2026
ఒంగోలు: బస్సు ప్రయాణంలో రూ.9 లక్షల బంగారం చోరీ.. చివరికి.!

ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో బస్సులో దొంగిలించిన 120 గ్రాముల బంగారం కేసును ప్రకాశం జిల్లా పోలీసులు ఛేదించారు. బాపట్ల జిల్లా బల్లికురవ మండలం కమ్మినేనివారిపాలెం గ్రామానికి చెందిన బోయిన హిమబిందు ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా మధ్యప్రదేశ్‌కు చెందిన ఇద్దరు నిందితులను గుర్తించారు. రూ.9 లక్షల విలువైన బంగారం రికవరీ చేసి SP హర్షవర్ధన్ రాజు బాధితురాలికి అందజేశారు.
News March 17, 2026
ప్రకాశం SP పరిష్కార వేదికకు 95 అర్జీలు

ప్రకాశం జిల్లా SP కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అనూహ్య స్పందన లభించినట్లు SP కార్యాలయం పేర్కొంది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదారులు పెద్ద ఎత్తున వేదికకు వచ్చినట్లు వెల్లడించింది. మొత్తం 95 అర్జీలను SP హర్షవర్ధన్ రాజు సోమవారం స్వీకరించారు. ఫిర్యాదులపై విచారణ చేపట్టి న్యాయం అందించేందుకు సంబంధిత అధికారులకు సూచించారు.


