News November 30, 2025
ప్రకాశం ప్రజలకు కలెక్టర్ కీలక సూచన

ప్రకాశం జిల్లాలో సోమవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాజాబాబు కోరారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో ఆదివారం ఆయన మాట్లాడుతూ.. వర్షాల నేపథ్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద 24 గంటల కంట్రోల్ రూమ్ 08592 – 281400 ఏర్పాటు చేశామని చెప్పారు. అత్యవసర ఆపరేషన్ కేంద్రం టోల్ ఫ్రీ నెంబర్ 1077 అందుబాటులో ఉంటుందని సూచించారు.
Similar News
News February 7, 2026
ప్రకాశం: పొగాకు బోర్డు అధికారి ట్రాన్స్‌ఫర్

కొండపి పొగాకు వేలం కేంద్రం నిర్వహణ అధికారి సునీల్ బదిలీ అయ్యారు. ఆయనను కర్ణాటకకు ట్రాన్స్‌ఫర్ చేశారు. ఆయన స్థానంలో గుంటూరులో పనిచేస్తున్న శంకర్ రావును నియమించారు. త్వరలో ఆయన కొండపికి వస్తారు. పాత అధికారి సునీల్ బాధ్యతలు చేపట్టిన తర్వాత బోర్డులో రైతులకు ఇబ్బందులు లేకుండా కొన్ని సంస్కరణలు చేపట్టారు. ఇప్పుడు ఆయన ట్రాన్స్‌ఫర్ కావడంతో రైతులు అసహనానికి గురవుతున్నారు.
News February 7, 2026
మార్కాపురం: కోరిక తీర్చలేదని చంపేశాడు..!

పొదిలి(M) గోగినేనివారిపాలెంలో గత నెల 18న జరిగిన హత్య కేసులో నిందితుడిని అరెస్ట్ చేశారు. బుల్లెమ్మ(49) భర్త చనిపోగా ఒంటరిగా ఉంటోంది. అదే ఊరికి చెందిన ఏడుకొండలుకు చాలామంది మహిళలతో అక్రమ సంబంధం ఉందని ఆయన భార్యకు బుల్లెమ్మ చెప్పింది. దీంతో భార్య పుట్టింటికి వెళ్లింది. బుల్లెమ్మపై పగ పెంచుకున్న ఏడుకొండలు ఆమె ఇంటికి వెళ్లాడు. తన కోరిక తీర్చాలని అడగ్గా.. ఒప్పుకోలేదు. దీంతో మెడకు తాడు బిగించి చంపేశాడు.
News February 7, 2026
సింగరాయకొండలో ఈ నెల 8న తిరుప్పావడ సేవ

సింగరాయకొండ శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో ఫిబ్రవరి 8న ఆదివారం ఉదయం 6:30 గంటలకు తిరుప్పావడ సేవ జరుగుతుంది. స్వాతి నక్షత్రం సందర్భంగా స్వామివారికి పంచామృతాభిషేకంతో పాటు ఈ సేవ నిర్వహిస్తామని EO కృష్ణవేణి తెలిపారు. భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని ఆమె అన్నారు.


