News August 21, 2025

ప్రకాశం: వినాయక విగ్రహాలకు పర్మిషన్ ఇలా.!

image

ప్రకాశం జిల్లాలో వినాయక విగ్రహాల ఏర్పాటుకు ప్రతి ఒక్కరూ కచ్చితంగా పోలీసుల పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. అది ఎలానో ఇప్పుడు చూద్దాం.
➤<>దీనిపై క్లిక్ చేయండి.<<>>
➤ఫోన్ నంబర్ టైప్ చేసి ఓటీపి ఎంటర్ చేయండి.
➤ తర్వాత అక్కడ అడిగే అన్ని వివరాలు నమోదు చేసి సబ్‌మిట్ చేయండి.
NOTE: అప్లికేషన్‌లో విగ్రహం సైజ్ ఎంతో చెప్పాల్సి ఉంటుంది.
ఇలా ముందుగానే విగ్రహాన్ని బుక్ చేసుకుని పర్మీషన్ పొందండి.

Similar News

News January 22, 2026

ఒంగోలు మీదుగా అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్..!

image

దక్షిణ మధ్య రైల్వే పరిధిలో కొత్తగా తాంబరం–సంత్రాగాచి–తాంబరం అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ (16107/16108) వారానికి ఒకసారి నడవనుంది. జనవరి 23 నుంచి తాంబరం నుంచి, జనవరి 24 నుంచి సంత్రాగాచి నుంచి సేవలు ప్రారంభం కానున్నాయి. ఈ రైలు ఒంగోలు మీదుగా ప్రయాణించనుంది. ప్రయాణికులకు వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణం అందించనుందని రైల్వే వర్గాలు పేర్కొన్నాయి.

News January 22, 2026

మార్కాపురం జిల్లా.. మొదటిసారి రథసప్తమి వేడుకలు

image

మార్కాపురం జిల్లా ఏర్పడిన అనంతరం మొదటిసారి చెన్నకేశవ స్వామి రథసప్తమి వేడుకలు ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఆధ్వర్యంలో నూతన ఉత్తేజంతో ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఈవో శ్రీనివాసరెడ్డి తెలిపారు. జనవరి 25వ తేదీ ఉదయం నుంచి రాత్రి వరకు జరుగుతుందన్నారు. సూర్యప్రభ వాహనం, శేష వాహనం, గరుడ వాహనం, హనుమంత వాహనం, చక్ర స్నానం, కల్పవృక్ష వాహనం, రజిత రథోత్సవం, చంద్రప్రభ వాహనాలపై చెన్నకేశవ స్వామి దర్శనమిస్తారన్నారు.

News January 22, 2026

ప్రకాశం: కందికి రూ.8వేలు

image

కంది కొనుగోలుకు రూ.8 వేలుగా ధరను ప్రభుత్వం నిర్ణయించిందని బేస్తవారిపేట మండల వ్యవసాయ అధికారి షేక్ అబ్దుల్ రఫీక్ తెలిపారు. ఈ విషయాన్ని మండలంలో నిర్వహిస్తున్న పొలం పిలుస్తోంది కార్యక్రమంలో రైతులకు వివరిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. రైతులందరూ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించుకోవాలని సూచించారు. కంది పైరు వేసిన ప్రతి రైతు వారికి సంబంధించిన RSK సిబ్బందిని సంప్రదించి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు.