News August 21, 2025

ప్రకాశానికి మంత్రుల రాక

image

జిల్లాల పునర్విభజన మార్పులపై ఏర్పాటు చేసిన మంత్రుల బృందం ఈ నెల 30వ తేదీన ప్రకాశం జిల్లాకు రానున్నట్లు సమాచారం. ప్రకాశం జిల్లాలోని మార్కాపురాన్ని జిల్లాగా ప్రకటించడం, కందుకూరును జిల్లాలో కలపడం, ఇతర అంశాలపై మంత్రుల బృందం ప్రజాభిప్రాయ సేకరణ చేసే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. మంత్రులు నిమ్మల రామానాయుడు, సత్య కుమార్ యాదవ్ జిల్లాకు రానున్నట్లు ప్రచారం సాగుతోంది. అయితే అధికారులు ధృవీకరించాల్సి ఉంది.

Similar News

News January 23, 2026

జగన్‌ పాలనలో అన్ని వర్గాలకూ వేధింపులే: మంత్రి స్వామి

image

గత ఐదేళ్ల వైసీపీ పాలనలో జగన్మోహన్‌రెడ్డి సామాన్యుల నుంచి ఉద్యోగుల వరకు అందరినీ వేధించారని మంత్రి బాలవీరాంజనేయ స్వామి విమర్శించారు. అభివృద్ధిని విస్మరించి అమరావతి, పోలవరం, వెలుగొండ ప్రాజెక్టులను అస్తవ్యస్తం చేశారని మండిపడ్డారు. ప్రజలు ఛీత్కరించినా వైసీపీ నేతల్లో మార్పు రాకపోవడం దురదృష్టకరమన్నారు. జగన్ తీరుతో రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబడిందని ఆయన ధ్వజమెత్తారు.

News January 22, 2026

ఒంగోలు మీదుగా అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్..!

image

దక్షిణ మధ్య రైల్వే పరిధిలో కొత్తగా తాంబరం–సంత్రాగాచి–తాంబరం అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ (16107/16108) వారానికి ఒకసారి నడవనుంది. జనవరి 23 నుంచి తాంబరం నుంచి, జనవరి 24 నుంచి సంత్రాగాచి నుంచి సేవలు ప్రారంభం కానున్నాయి. ఈ రైలు ఒంగోలు మీదుగా ప్రయాణించనుంది. ప్రయాణికులకు వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణం అందించనుందని రైల్వే వర్గాలు పేర్కొన్నాయి.

News January 22, 2026

మార్కాపురం జిల్లా.. మొదటిసారి రథసప్తమి వేడుకలు

image

మార్కాపురం జిల్లా ఏర్పడిన అనంతరం మొదటిసారి చెన్నకేశవ స్వామి రథసప్తమి వేడుకలు ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఆధ్వర్యంలో నూతన ఉత్తేజంతో ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఈవో శ్రీనివాసరెడ్డి తెలిపారు. జనవరి 25వ తేదీ ఉదయం నుంచి రాత్రి వరకు జరుగుతుందన్నారు. సూర్యప్రభ వాహనం, శేష వాహనం, గరుడ వాహనం, హనుమంత వాహనం, చక్ర స్నానం, కల్పవృక్ష వాహనం, రజిత రథోత్సవం, చంద్రప్రభ వాహనాలపై చెన్నకేశవ స్వామి దర్శనమిస్తారన్నారు.