News August 13, 2025

ప్రజలందరు అప్రమత్తంగా ఉండాలి : వరంగల్ సీపీ

image

రానున్న 72 గంటల్లో భారీ స్థాయిలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. వరంగల్ కమిషనర్ పరిధిలోని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ సూచించారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి పోవాలని అలాగే శిథిలావస్థలో ఉన్న భవనాలు, ఇండ్లల్లో నివసించే వారు సైతం సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని కమిషనర్ తెలిపారు.

Similar News

News March 15, 2026

ధాన్యం కొనుగోలుకు 240 కేంద్రాలు: కలెక్టర్ సత్యశారద

image

జిల్లాలో 2025-26 రబీ సీజన్‌లో 2.10 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నామని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా 240 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ డా.సత్యశారద అధికారులను ఆదేశించారు. ఆదివారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ సంధ్యారాణితో కలిసి పౌరసరఫరాలు, మార్కెటింగ్ అధికారులతో ఆమె సమీక్షించారు.

News March 14, 2026

మొదటి రోజు 99.9 శాతం హాజరు: డీఈవో

image

వరంగల్ జిల్లాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు 9,485 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా, 9,475 మంది హాజరు కాగా 10 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. మొత్తం 99.8 శాతం విద్యార్థులు హాజరయ్యారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పరీక్షలను పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు డీఈవో రంగయ్య వెల్లడించారు.

News March 14, 2026

WGL: గ్యాస్ సిలిండర్ల బుకింగ్ భారీగా పెరుగుదల

image

పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో గ్యాస్ సరఫరా దెబ్బతింటుందనే ఆందోళనతో జిల్లాలో ఎల్పీజీ సిలిండర్ల బుకింగ్‌లు భారీగా పెరిగాయి. జిల్లాలో 16 గ్యాస్ ఏజెన్సీల పరిధిలో జనవరిలో రోజుకు సుమారు 16 వేల బుకింగ్‌లు ఉండగా, శుక్రవారం ఒక్క రోజే 59,200 బుకింగ్‌లు నమోదయ్యాయి. దీంతో అత్యవసరంగా అవసరమైన వారికి సిలిండర్లు ఆలస్యంగా అందుతున్నాయి. సరఫరాలో అంతరాయం లేదని, అవసరానికి మించి బుకింగ్ చేయవద్దని అధికారులు తెలిపారు.