News November 17, 2025
ప్రజలకు మరింత చేరువలో పీజీఆర్ఎస్ సేవలు: కలెక్టర్

ప్రజా ఫిర్యాదుల పరిష్కారాన్ని మరింత వేగవంతంగా, ప్రజల దృష్టికి మరింత చేరువ చేయడం లక్ష్యంగా (PGRS) సేవలను సోమవారం మండల, డివిజనల్, మున్సిపల్ స్థాయిల్లో కూడా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు. జిల్లా స్థాయిలో కలెక్టరేట్ గోదావరి సమావేశం మందిరంలో నవంబర్ 17వ తేదీ సోమవారం ఉదయం 10 గంటల నుంచి యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ పత్రికా ప్రకటన ద్వారా స్పష్టం చేశారు.
Similar News
News January 24, 2026
డెయిరీ ఫామ్ ప్రారంభించే ముందు ఇవి చేయాలి

డెయిరీ ఫామ్ ప్రారంభానికి ముందు కొంత భూమిలో నేపియర్, గినీ గడ్డి, జొన్న.. మరి కొంత భూమిలో అలసంద, పిల్లిపెసర, లూసర్న్ పశుగ్రాసాలను సాగుచేయాలి. సుబాబుల్, అవిసె చెట్లను ఫామ్ పెట్టే స్థలం చుట్టూ కంచెలా వేయాలి. ఇలా పశుగ్రాసాన్ని పెంచి, షెడ్లు కట్టిన తర్వాత పరికరాలు, మందులు కొనుగోలు చేశాక పాడి పశువులను కొనాలంటున్నారు నిపుణులు. అధిక పాలిచ్చే పశువుకు ఉండే లక్షణాలు తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట క్లిక్ <<>>చేయండి.
News January 24, 2026
ఏలూరు: ప్రమాదం.. బావాబామ్మరుదులు మృతి

గ్రీన్ ఫీల్డ్ హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో జంగారెడ్డిగూడెం మండలం లక్కవరానికి చెందిన కొమ్ము సాయి, కామవరపుకోట మండలం రామవరానికి చెందిన గట్టు రాంబాబు మృతి చెందారు. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా కల్లూరు మండలం లింగాల గ్రామ సమీపంలో గ్రీన్ ఫీల్డ్ హైవే పై బైక్ అదుపు తప్పి రైలింగ్ ఢీకొనడంతో వారిద్దరూ మృతి చెందారు. వారిద్దరూ వరుసకు బావ బావమరుదులు. మొక్కజొన్న కంపెనీలో పనిచేస్తున్నట్లు తెలిసింది.
News January 24, 2026
14.6 డిగ్రీలకు పడిపోయిన పటాన్‌చెరు ఉష్ణోగ్రత

సంగారెడ్డి జిల్లాలో చలి తీవ్రత పెరిగింది. శనివారం ఉదయం జిన్నారంలో 16.0°, గుమ్మడిదలలో 17.9°, అమీన్పూర్‌లో 18.8°, రామచంద్రాపురంలో 18.7°, పటాన్‌చెరులో 14.6° ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గాలిలో తేమశాతం 88.4%గా ఉంది. ఉదయం పొగమంచు కమ్ముకోవడంతో విజిబిలిటీ తగ్గి వాహనదారులు, పాదాచారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.


