News November 19, 2025
ప్రజల అవసరాలకు అనుగుణంగా పనిచేయాలి: KMR SP

కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర దేవునిపల్లి పోలీస్ స్టేషన్‌ను మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు, రిసెప్షన్, లాక్-అప్ రూమ్ సహా అన్ని విభాగాలను పరిశీలించారు. సైబర్ క్రైమ్, ఆన్‌లైన్ మోసాలు, మూఢనమ్మకాలు వంటి అంశాలపై గ్రామాల్లో అవగాహన పెంచాలని సూచించారు. ప్రజా ఫిర్యాదుల్లో ఎలాంటి జాప్యం చేయకుండా తక్షణమే స్పందించాలని ఎస్పీ సూచించారు. ASP చైతన్య రెడ్డి, CI రామన్, SHO రంజిత్ పాల్గొన్నారు.
Similar News
News January 23, 2026
భర్తను చంపిన భార్య.. కీలక విషయాలు

AP: గుంటూరు(D) దుగ్గిరాలలో భర్తను భార్య చంపి రాత్రంతా పోర్న్ వీడియోలు చూసిన <<18921625>>కేసులో<<>> కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. భర్త నాగరాజే తనకు పోర్న్ వీడియోలు చూడటం అలవాటు చేశాడని విచారణలో భార్య మాధురి చెప్పినట్లు పోలీసులు తెలిపారు. ఇక తన బిడ్డ అలా చేసుండదని, ఆమెను ఘోరంగా అవమానిస్తున్నారని మాధురి తల్లి బీబీసీ వద్ద వాపోయారు. కాగా ప్రియుడు గోపీతో కలిసి భర్త నాగరాజును మాధురి హత్య చేసినట్లు కేసు నమోదైంది.
News January 23, 2026
విశాఖ: 4 రోజులు విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చు

ఆంధ్రప్రదేశ్ విద్యుత్ పంపిణీ సంస్థ విశాఖపట్నం ఆపరేషన్ సర్కిల్ పరిధిలో ఉన్న అన్ని కలెక్షన్ కౌంటర్లు 24 నుంచి 27వ తేదీ వరకు అనగా.. శని, ఆది, సోమ, మంగళ వారాలలో కూడా పనిచేస్తాయని విద్యుత్ సంస్థ ఆపరేషన్ సర్కిల్ పర్యవేక్షక ఇంజినీర్ శ్యాంబాబు తెలిపారు. వినియోగదారులు తమ విద్యుత్ బిల్లులను విద్యుత్ రెవెన్యూ కార్యాలయంలోనూ, ఈ-సేవ, మీసేవ కౌంటర్లలో చెల్లించుకోవచ్చని ప్రకటించారు.
News January 23, 2026
సంగారెడ్డి కలెక్టరేట్‌ను సందర్శించిన శ్రీలంక ప్రతినిధులు

శ్రీలంకలోని సిలోన్ వర్కర్ కాంగ్రెస్‌కు చెందిన సభ్యులు సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్, ఫల పరిశోధన కేంద్రాన్ని శుక్రవారం సందర్శించారు. సంస్థాగత సామర్థ్యాల బలోపేతం, ఉత్తమ పాలన విధానాలపై అవగాహన కల్పించడం, అలాగే భారత్-శ్రీలంక దేశాల మధ్య పరస్పర అనుభవాల మార్పిడి ప్రధాన లక్ష్యమని తెలిపారు. నువారా ఎలియా డిప్యూటీ మేయర్‌తో పాటు శ్రీలంకకు చెందిన 20 మంది ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


