News August 21, 2025

ప్రజల ఆశీర్వాదమే ప్రభుత్వానికి బలం: మంత్రి పొంగులేటి

image

రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అభివృద్ధి కార్యక్రమానికి, సంక్షేమ పథకాల అమలుకు ప్రజలే ఆధారం అని, వారి ఆశీర్వాదాలే ఇందిరమ్మ ప్రభుత్వానికి బలం అని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. తిరుమలాయపాలెం మండలంలో గురువారం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఎనిమిదో తరగతి చదువుతున్న 91 మంది బాలికలకు సైకిళ్లు పంపిణీ చేసి, మాట్లాడారు.

Similar News

News January 23, 2026

నేటి నుంచి తిరుపతిలో టోకెన్ల్ బంద్

image

తిరుమలలో ఈనెల 25న రథసప్తమి వేడుకలు చేయనున్నారు. ఈక్రమంలో మూడురోజులు సర్వదర్శన టోకెన్ల జారీని టీటీడీ నిలిపివేయనుంది. తిరుపతిలోని మూడు కేంద్రాల్లో ఈనెల 23, 24, 25వ తేదీల్లో ఈ టికెట్లు జారీ చేయరు. తిరిగి 26వ తేదీన మరుసటి రోజు దర్శనానికి సంబంధించి టోకెన్లను ఇస్తారు. ఈ మేరకు ఆయా టోకెన్ల జారీ కేంద్రాల వద్ద బోర్డులు ఏర్పాటు చేశారు.

News January 23, 2026

నేడే సెకండ్ T20.. అక్షర్ పటేల్, బుమ్రా దూరం!

image

నేడు రాయ్‌పూర్ వేదికగా IND-NZ మధ్య రెండో T20 జరగనుంది. తొలి మ్యాచ్‌లో గాయపడిన అక్షర్ పటేల్ ఇవాళ ఆడే పరిస్థితి కనిపించట్లేదు. అతని స్థానంలో కుల్దీప్‌ ఆడే ఛాన్సుంది. మరోవైపు వర్క్‌లోడ్ మేనేజ్మెంట్‌లో భాగంగా బుమ్రాకి రెస్ట్ ఇచ్చి హర్షిత్‌కు అవకాశమివ్వొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. అతనొస్తే బ్యాటింగ్ పరంగానూ కొంత బలం పెరుగుతుంది అంటున్నారు. రా.7గం.కు స్టార్ స్పోర్ట్స్, హాట్‌స్టార్‌లో లైవ్ చూడొచ్చు.

News January 23, 2026

తాడిపత్రిలో పొలిటికల్ టెన్షన్

image

సవాల్.. ప్రతి సవాల్‌తో తాడిపత్రిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. తాడిపత్రి అభివృద్ధిపై చర్చకు సిద్ధమని కేతిరెడ్డి సవాల్ విసరగా మీ ఇంటి వద్దే సవాల్ స్వీకరిస్తామని టీడీపీ నాయకులు కౌంటర్ ఇచ్చారు. మరోవైపు టీడీపీ కార్యకర్తలు, జేసీ అభిమానులు నేడు ఎమ్మెల్యే అస్మిత్ ఇంటి వద్దకు తరలిరావాలని సోషల్‌ మీడియా వేదికగా పిలుపునిచ్చారు. దీంతో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశం ఉండటంతో పోలీసులు అలర్ట్ అయ్యారు.