News November 8, 2024
ప్రజల మద్దతుంటే అరెస్టులెందుకు..?: హరీశ్ రావు
ఉమ్మడి నల్గొండ జిల్లాలో మాజీ ఎమ్మెల్యేలు లింగయ్య, భూపాల్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి అరెస్టులను ఎమ్మెల్యే హరీశ్ రావు ఖండించారు. హౌస్ అరెస్టులు చేసి చేపట్టే పాదయాత్రకు ప్రజల నుంచి మద్దతు లభించదన్నారు. మూసీ మురికికి 50ఏళ్ల కాంగ్రెస్ పాలన కారణం కాదా అని ప్రశ్నించారు. పాదయాత్రకు ప్రజల మద్దతు ఉంటే అక్రమ అరెస్టులెందుకుని.. దమ్ముంటే పేదల ఇళ్లు కూల్చిన హైదరాబాద్ నుంచి పాదయాత్ర చేయాలని సవాల్ విసిరారు.
Similar News
News December 14, 2024
సంగారెడ్డి : నేటి లోక్అదాలత్ జిల్లా వ్యాప్తంగా 7బెంచీలు
జాతీయ లోక్ అదాలత్ విజయవంతం చేయడానికి జిల్లా వ్యాప్తంగా 7 బెంచీలను ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రమేశ్ తెలిపారు. సంగారెడ్డిలో మూడు బెంచీలు, జోగిపేటలో ఒకటి, నారాయణఖేడ్ ఒకటి, జహీరాబాద్ ఒకటి, మొత్తం ఏడు బెంచీలు ఏర్పాటు చేశామన్నారు. పెండింగ్ కేసులను తొందరగా పరిష్కరించేందుకు, కేసు పెండింగ్లో ఉన్నవారు, కోర్టుల చుట్టూ తిరుగుతున్న కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
News December 14, 2024
మనోహరాబాద్: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం రామాయపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందింది. రామాయపల్లి గ్రామానికి చెందిన కటికల రేణుక (40) సమీపంలోని ఇండూస్ మెడికేర్ కంపెనీలో కార్మికురాలిగా పనిచేస్తోంది. ఈరోజు ఉదయం కంపెనీకి వెళ్తుండగా గ్రామ చౌరస్తా వద్ద బైక్ ఢీకొనడంతో అక్కడికక్కడే రేణుక మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. మృతదేహాన్ని తూప్రాన్ ఆస్పత్రి మార్చురీకి తరలించారు.
News December 14, 2024
మెదక్: నేడు మంత్రి కొండా సురేఖ పర్యటన
మెదక్ జిల్లా నర్సాపూర్ మండలంలో శనివారం రాష్ట్ర దేవాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ పర్యటించనున్నారు. మండల పరిధిలోని అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అర్బన్ పార్క్‌ను మంత్రి సందర్శిస్తారని అధికారులు తెలిపారు. అర్బన్ పార్క్‌లో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవం శంకుస్థాపన కార్యక్రమంలో ఆమె పాల్గొంటారని పేర్కొన్నారు.