News April 23, 2025

ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించండి: మండిపల్లి

image

రాయచోటి పట్టణంలోని స్టేట్ గెస్ట్ హౌస్‌లో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రజా దర్బార్ నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి ప్రజలు తరలివచ్చి తమ సమస్యలను అర్జీల రూపంలో మంత్రికి వివరించారు. సంబంధిత అధికారులతో మంత్రి ఫోన్లో మాట్లాడారు. బాధితుల సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు.

Similar News

News March 13, 2026

జిల్లాలో బాపట్ల మండలం అత్యధికం

image

బాపట్ల జిల్లా వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ కింద అత్యధికంగా బాపట్ల మండలంలో రైతులకు లబ్ధి చేకూరనున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి విజయనిర్మల తెలిపారు. బాపట్ల మండలంలో అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 11,275 మందికి రూ.4.51 కోట్లు, పీఎం కిసాన్ పథకం ద్వారా 8,811 మందికి 1.76 కోట్లు నిధులు విడుదల కానున్నట్లు తెలిపారు. మొత్తంగా 6.27 కోట్ల రూపాయలు నిధులు శుక్రవారం నేరుగా రైతుల ఖాతాల్లో జమవుతాయన్నారు.

News March 13, 2026

ఆర్మూర్: 68 గ్యాస్ సిలిండర్లు సీజ్

image

ఆర్మూర్ పట్టణంలోని హోటళ్లు, టిఫిన్ సెంటర్లపై విజిలెన్స్, సివిల్ సప్లై అధికారులు శుక్రవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా గృహ వినియోగ (డొమెస్టిక్) గ్యాస్ సిలిండర్లను వాడుతున్న 31 సెంటర్లను గుర్తించి, మొత్తం 68 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. వాణిజ్య అవసరాలకు డొమెస్టిక్ సిలిండర్లు వాడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు ఈ సందర్భంగా హెచ్చరించారు.

News March 13, 2026

పశువుల్లో గాలికుంటు వ్యాధి లక్షణాలను ఇలా గుర్తించండి

image

ఈ వ్యాధి సోకిన పశువులకు గిట్టల మధ్య బొబ్బలు ఏర్పడతాయి. 3, 4 వారాల్లో బొబ్బలు పగిలి పుండ్లుగా మారతాయి. చర్మం గరుకుగా మారి నోటి చిగుళ్లపై పొక్కులు ఏర్పడటం వల్ల పశువులు మేత మేయలేవు. నీరసంగా ఉంటాయి. పశువుకు 104 నుంచి 105 డిగ్రీల ఫారన్ హీట్ వరకు జ్వరం ఉంటుంది. పాడిగేదెల్లో పాల దిగుబడి గణనీయంగా తగ్గిపోతుంది. ఎద్దుల్లో రోగ నిరోధకశక్తి తగ్గి అలసటకు గురై నీరసంగా మారతాయి.