News April 14, 2024
ప్రజాదరణ చూసి ఓర్వలేక దాడి: జడ్పీ ఛైర్మన్

విజయవాడలో మేమంతా సిద్ధం బస్సు యాత్రలో సీఎం జగన్‌పై రాయితో దాడి చేసిన ఘటనపై జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు స్పందించారు. మళ్లీ జగన్ సీఎం కాబోతున్నారని, సిద్ధం సభకు వచ్చిన ప్రజాదరణ చూసి ఓర్వలేకనే ఈ దాడికి పాల్పడినట్లు ఆరోపించారు. రాజ్యాంగ బద్ధంగా అధికారంలోకి రావాలే కానీ.. జగన్‌ను భౌతికంగా దూరం చేసి అధికారంలోకి రావాలన్న ఆలోచన మంచి విధానం కాదన్నారు. మరో 30 ఏళ్లు జగన్ ప్రజల గుండెల్లో ఉంటారన్నారు.
Similar News
News December 17, 2025
VZM: 20 నుంచి ఆర్టీసీ డోర్ డెలివరీ మాసోత్సవాలు

ఈనెల 20 నుంచి జనవరి 19 వరకు ఆర్టీసీ కార్గో సేవల్లో డోర్ డెలివరీ మాసోత్సవాలను నిర్వహిస్తామని విజయనగరం జిల్లా ప్రజారవాణా అధికారి జి.వరలక్ష్మి తెలిపారు. నగరాల్లో 10 కి.మీ పరిధిలో 50 కేజీల వరకు పార్శిల్స్ డోర్ డెలివరీ చేస్తామన్నారు. తక్కువ ధరతో వేగంగా, సురక్షితంగా మీ ఇంటి వద్దకు అందిస్తామని చెప్పారు. ఈ అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని ఆమె కోరారు.
News December 16, 2025
బొబ్బిలి: మార్మాంగం కోసుకున్న మతిస్థిమితం లేని యువకుడు

బొబ్బిలి పట్టణంలోని మతిస్థిమితం లేని యువకుడు మార్మాంగం కోసేసుకున్నాడు. విశాఖపట్నం రెల్లి వీధి ప్రాంతానికి చెందిన మతిస్థిమితం లేని యువకుడు సోమవారం బొబ్బిలిలో రక్తంతో రోడ్లుపై తిరుగుతుండగా స్థానికులు గమనించారు. వెంటనే ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రథమ చికిత్సకు యువకుడు సహకరించకపోవడంతో వైద్యులు బలవంతంగా వైద్యం చేసి విజయనగరం రిఫర్ చేయగా అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం KGHకి తరలించారు.
News December 16, 2025
VZM: ప్రభుత్వ వైద్యశాలలో ఉద్యోగాల ఎంపిక జాబితా విడుదల

విజయనగరంలోని స్థానిక ప్రభుత్వ వైద్య కళాశాల, సర్వజన ఆసుపత్రి పరిధిలో వివిధ పోస్టుల భర్తీకి సంబంధించి ఎంపిక జాబితాలు విడుదలయ్యాయని కళాశాల ప్రిన్సిపల్ డా.సరోజినీ దేవి మంగళవారం తెలిపారు. 20 కేటగిరీల్లో 91 పోస్టులకు సంబంధించిన ఫైనల్ మెరిట్ లిస్టులు, షార్ట్‌లిస్టెడ్ క్యాండిడేట్స్ జాబితాలు, స్పీకింగ్ ఆర్డర్లు ఆన్‌లైన్‌లో పొందుపరిచామన్నారు. జాబితాలపై అభ్యంతరాలు ఉంటే ఈనెల 16, 17 తేదీల్లో తెలియజేయాలన్నారు.


