News November 7, 2025

ప్రజారాజధాని అమరావతి నిర్మాణానికి కొత్త ఊపు.!

image

రాజధాని నిర్మాణానికి రూ. 7,500 కోట్ల రుణం అందించేందుకు నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ బ్యాంక్ సంసిద్ధత వ్యక్తం చేసింది. రుణం మంజూరుకు సంబంధించిన పత్రాలను శుక్రవారం అమరావతిలో CM చంద్రబాబు, మంత్రి నారాయణ సమక్షంలో CRDA కమిషనర్ కన్నబాబుకు అందజేశారు. కార్యక్రమంలో NABFID డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ సామ్యూల్ జోసెఫ్, తదితరులు పాల్గొన్నారు.

Similar News

News January 17, 2026

కడప టు ఢిల్లీ

image

ఢిల్లీలో జరిగే గణతంత్ర వేడుకలకు కడప కూచిపూడి కళాకారిణి మూలి పల్లవి ఎంపికయ్యారు. లలిత కళలకు నిలయమైన కడపకు అరుదైన గౌరవాన్ని మూలి పల్లవి తీసుకొచ్చారు. భారత సాంస్కృతిక శాఖ నుంచి ప్రత్యేక ఆహ్వానం మేరకు ఢిల్లీకి వెళ్లి భారత అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్, సంగీత నాటక అకాడమీ కేంద్రాలలో ప్రత్యేక రిహార్సల్ పొందుతున్నారు. ఏపీ నుంచి కూచిపూడి నృత్యానికి సంబంధించి 30 మందిని ఎంపికచేసింది.

News January 17, 2026

ఇరాన్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడితే.. భారత్‌కు కష్టమేనా?

image

ఇరాన్‌లో ఏర్పడే కొత్త ప్రభుత్వంలో ఇండియాతో సన్నిహిత సంబంధాలు కోరుకుంటున్నామని యువరాజు రెజా పహ్లావి ప్రకటించారు. కానీ ఆయన తండ్రి షా మహ్మద్ గతంలో పాక్‌కు అనుకూలంగా ఉన్నారు. 1965, 1975 ఇండో-పాక్ యుద్ధాల్లో PAKకు మద్దతు తెలిపారు. ఇప్పుడు పహ్లావికి US సపోర్ట్ ఉంది. పాక్, US బంధం నేపథ్యంలో ఇరాన్ వాటికి తోడైతే మనకు కష్టమే. <<18876732>>చాబహార్ పోర్టు<<>> భవితవ్యంపై నీలినీడలు కమ్ముకునే ప్రమాదముంది.

News January 17, 2026

మరికాసేపట్లో ఎంవీఎస్ మైదానానికి సీఎం రేవంత్

image

మహబూబ్ నగర్‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు సర్వం సిద్ధమైంది. ఎంవీఎస్ కళాశాల మైదానంలో నిర్వహించనున్న బహిరంగ సభలో సీఎం ప్రసంగించనున్నారు. జిల్లా సమగ్ర అభివృద్ధికి సంబంధించి భారీ నిధులతో కూడిన ప్రాజెక్టులకు ఆయన ఇక్కడ నుంచి పునాది వేయనున్నారు. సభ కోసం మైదానానికి జనం భారీగా చేరుతుండటంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. సీఎం పర్యటన నేపథ్యంలో పట్టణంలో ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టారు.