News October 5, 2025
ప్రజావాణి కార్యక్రమం రద్దు: పెద్దపల్లి కలెక్టర్

కలెక్టరేట్లో సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజలు వినతులివ్వడానికి కలెక్టరేట్‌కు రావద్దని విజ్ఞప్తి చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా మోడల్ కోడ్ అమలులో ఉన్నందున అధికారులంతా క్షేత్రస్థాయిలో ఎన్నికల విధుల్లో ఉంటారని, ఆ కారణంతో ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ ప్రకటనలో పేర్కొన్నారు.
Similar News
News January 18, 2026
జిల్లాల పునర్ వ్యవస్థీకరణకు కమిషన్

TG: రాష్ట్రంలో జిల్లాల పునర్ వ్యవస్థీకరణకు రిటైర్డ్ జడ్జితో కమిషన్ వేయాలని క్యాబినెట్ నిర్ణయించింది. మేడారంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో మొత్తం 18 అంశాలపై చర్చించారు. పొట్లాపూర్ ఎత్తిపోతల పథకానికి, మేడారంలో శాశ్వత భవనాల నిర్మాణానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
News January 18, 2026
ముగిసిన సెలవులు.. గుంటూరు నుంచి ప్రత్యేక రైళ్లు

సంక్రాంతి సెలవులు ముగియడంతో గుంటూరులో ప్రయాణికుల రద్దీ పెరిగింది. ప్రధాన నగరాలకు వెళ్లే బస్సు, రైలు టికెట్లు ఇప్పటికే పూర్తిగా నిండిపోవడంతో రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. గుంటూరు నుంచి హైదరాబాద్, విశాఖపట్నం, బెంగళూరు, చెన్నై నగరాలకు ఈ స్పెషల్ రైళ్లు నడపనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News January 18, 2026
జాతీయ స్థాయి కబడ్డీకి పాలమూరు విద్యార్థినులు

స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (SGF) అండర్-19 విభాగంలో జిల్లాకు చెందిన శివాని, భవాని, మౌనిక జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికయ్యారు. హిమాచల్ ప్రదేశ్‌లో రేపటి నుంచి జరిగే ఈ టోర్నీలో వీరు పాల్గొంటారని ఎస్జీఎఫ్ కార్యదర్శి శారదాబాయి తెలిపారు. పాలమూరు క్రీడామణులు జాతీయ స్థాయికి ఎంపిక కావడం పట్ల ఉపాధ్యాయులు, గ్రామస్థులు, క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేస్తూ వారికి శుభాకాంక్షలు తెలిపారు.


