News August 11, 2025
ప్రజా సమస్యల పరిష్కారానికి 24 దరఖాస్తులు: ఎస్పీ

అమలాపురం ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 24 దరఖాస్తులు వచ్చాయని ఎస్పీ కృష్ణారావు తెలిపారు. దరఖాస్తుదారులతో ఎస్పీ స్వయంగా మాట్లాడి వారి వద్ద నుంచి లిఖితపూర్వకంగా ఫిర్యాదులు తీసుకున్నారు. చట్ట పరిధిలో సమస్యలను పరిష్కరించాలని, సంబంధిత అధికారులకు సూచించారు. నిర్ణీత గడువులోగా వాటిని పరిష్కరించాలన్నారు. బాధితులకు త్వరితగతిన న్యాయం చేయాలన్నారు.
Similar News
News March 12, 2026
అనకాపల్లి జిల్లాలో వినూత్న కార్యక్రమం.. సీఎం ప్రశంసలు

అనకాపల్లి జిల్లాలో 114 ప్రభుత్వ గురుకుల, ఆశ్రమ పాఠశాలలను జీరో వేస్ట్ స్కూల్స్ గా మారుస్తూ కలెక్టర్ విజయ కృష్ణన్ చేసిన వినూత్న కార్యక్రమం సీఎం చంద్రబాబు ప్రశంసలు అందుకుంది. అమరావతిలో జరుగుతున్న కలెక్టర్ల సదస్సులో జీరో వేస్ట్ స్కూల్స్‌లో చెత్త నుంచి సంపద సృష్టిపై కలెక్టర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. ఈ విధానాన్ని రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో అమలు చేయాలని సీఎం ఆదేశించారు.
News March 12, 2026
23న ఆర్సెలార్ స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన: CM

APలో మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు నిర్మాణానికి రంగం సిద్ధమైంది. ఈ నెల 23న అనకాపల్లి(D) నక్కపల్లి వద్ద ఆర్సెలార్ మిట్టల్ నిప్పన్ స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన చేయనున్నట్లు CM CBN ప్రకటించారు. ఈ కార్యక్రమానికి PM మోదీ కూడా హాజరయ్యే అవకాశం ఉండటంతో అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా రూ.1.35 లక్షల కోట్లతో 2 దశల్లో 5,300 ఎకరాల్లో స్టీల్‌ప్లాంట్‌ను నిర్మించనున్న విషయం తెలిసిందే.
News March 12, 2026
కర్నూలులో 250 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు!

కర్నూలులోని అబ్దుల్లా ఖాన్ ఎస్టేట్‌లో ఉన్న నందనం డిగ్రీ కాలేజీలో ఈనెల 14న ఉదయం 10 గంటలకు మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. ప్రముఖ కంపెనీల్లో సుమారు 250 ఖాళీలను భర్తీ చేయనున్నారు. టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, ఏదైనా డిగ్రీ చదివినవారు అర్హులు. ఆసక్తి గల అభ్యర్థులు బయోడేటాతో ఇంటర్వ్యూకు హాజరు కావాలని కళాశాల కరెస్పాండెంట్ జనార్ధన్ తెలిపారు.


