News November 13, 2025
ప్రతిష్టాత్మక కమిటీలో మచిలీపట్నం ఎంపీకి స్థానం

మచిలీపట్నం ఎంపీ బాలశౌరికి మరో ప్రతిష్టాత్మక కమిటీలో చోటు దక్కింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రాజ్యాంగ (130వ సవరణ) బిల్లు-2025 జమ్మూకశ్మీర్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వం (సవరణ) బిల్లు సంయుక్త కమిటీ సభ్యులుగా బాలశౌరిని నియమించారు. ప్రతిష్టాత్మకమైన కమిటీలో చోటు దక్కినందుకు ఎంపీ బాలశౌరి ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు కృతజ్ఞతలు తెలియజేశారు.
Similar News
News December 8, 2025
కృష్ణా జిల్లాలో ఏపీ టెట్ పరీక్షలకు పటిష్ఠ ఏర్పాట్లు: కలెక్టర్

జిల్లాలో ఈ నెల 10వ తేదీ నుంచి 21వ తేదీ వరకు నిర్వహించనున్న ఏపీ టెట్ పరీక్షల నిర్వహణకు పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై సోమవారం ఆయన సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 144 సెక్షన్ అమలు చేయాలన్నారు.
News December 8, 2025
మచిలీపట్నం: అనాధ పిల్లలకు ఆరోగ్య కార్డుల పంపిణీ

అనాధ పిల్లలకు ఆరోగ్య పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. కలెక్టరేట్‌లో ఎన్టీఆర్ వైద్య సేవల అమృత ఆరోగ్య పథకం కింద 17 అనాధ ఆశ్రమాలకు చెందిన 82 మంది అనాధ పిల్లలకు కలెక్టర్ చేతుల మీదుగా ఆరోగ్య కార్డులు అందజేశారు. ఆరోగ్యశ్రీ కార్డుల మాదిరి ఈ కార్డులు కూడా పని చేస్తాయన్నారు. కార్యక్రమంలో DMHO యుగంధర్, తదితరులు పాల్గొన్నారు.
News December 8, 2025
గన్నవరం నుంచి ఢిల్లీ వెళ్లే ఇండిగో ఫ్లైట్ రద్దు

విజయవాడ గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వెళ్లే విజయవాడ-ఢిల్లీ, ఢిల్లీ-VJA ఇండిగో సర్వీసులు సోమవారం రద్దయ్యాయి. మధ్యాహ్నం 2:20 గంటలకు గన్నవరం చేరుకోవాల్సిన విమానం, 2:50 గంటలకు దిల్లీకి బయలుదేరాల్సిన విమానం సాంకేతిక కారణాల వల్ల రద్దు అయినట్లు విమానాశ్రయ అధికారులు తెలిపారు. ప్రయాణికులకు టికెట్ ఛార్జీల రీఫండ్ లేదా రీషెడ్యూల్ చేసుకునే సౌకర్యాన్ని అందుబాటులో ఉంచామని ఇండిగో సంస్థ పేర్కొంది.


