News March 14, 2025
ప్రతి గ్రామంలో స్వచ్ఛాంద్ర – స్వర్ణాంధ్ర జరగాలి: కలెక్టర్

జిల్లాలో ఈనెల 15న ప్రతి గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో స్వచ్ఛాంద్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమం సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తెలిపారు. ఏలూరు కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి గురువారం సబ్ కలెక్టర్లు, జిల్లా అధికారులు, రెవిన్యూ అధికారులతో కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ప్రభుత్వం రూపొందించిన యాప్‌లో స్వచ్ఛాంద్ర కార్యక్రమాలు పొందుపరచాలన్నారు.
Similar News
News February 17, 2026
సల్మాన్ తండ్రి సలీమ్‌కు అస్వస్థత

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తండ్రి, ప్రముఖ రచయిత సలీమ్ ఖాన్ (90) అస్వస్థతకు గురయ్యారు. ముంబైలోని లీలావతీ ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే సల్మాన్ ఖాన్ సహా కుటుంబసభ్యులు అక్కడికి చేరుకున్నారు. కాగా సలీమ్ ఖాన్ ఎన్నో హిట్ చిత్రాలకు కథ, మాటలు రాశారు. మరో బాలీవుడ్ రచయిత జావెద్ అక్తర్‌తో కలిసి షోలే, దీవార్, జంజీర్, త్రిశూల్, డాన్ వంటి బ్లాక్‌బస్టర్లు అందించారు.
News February 17, 2026
ప్రొద్దుటూరులో నేటి బంగారు, వెండి ధరల వివరాలు.!

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో మంగళవారం బంగారం, వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
* 24 క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర రూ.15,400
* 22 క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర రూ.14,168
* 10 గ్రాముల వెండి ధర రూ.2,438.
News February 17, 2026
కామారెడ్డి: ఇందిరా గాంధీ, ఎన్టీఆర్ ఆదర్శం: ఎమ్మెల్యే

తనకు మాజీ ప్రధాని ఇందిరాగాంధీ, స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రులు ఎన్టీఆర్, వైయస్ఆర్, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు తనకు ఆదర్శమని ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి చెప్పారు. మంగళవారం కామారెడ్డిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇందిరాగాంధీలో పేదలకు చేసిన సేవ, చంద్రబాబు నాయుడులో ముందస్తు విజన్ తనకు ఆదర్శమన్నారు.


