News July 8, 2024
ప్రతీ కార్యకర్తకు వైసీపీ తోడుగా ఉంటుంది: YS జగన్

పులివెందుల: రాబోయే కాలంలో ప్రతీ కార్యకర్తకు తనతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తోడుగా ఉంటుందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భరోసానిచ్చారు. పులివెందుల పర్యటనలో భాగంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు, మాజీ నేతలతో కూడా చర్చించారు. కార్యకర్తలు, నాయకులు ఎవరూ అధైర్యపడవద్దు, పార్టీ అండగా ఉంటుందని, అందరం కలిసి కట్టుగా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉందని వివరించారు.
Similar News
News December 12, 2025
కడప YVUలో ప్రవేశానికి దరఖాస్తులు

కడప YVU పరిధిలోని అనుబంధ కళాశాలల్లో నాలుగో సంవత్సరంలో ప్రవేశానికి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు వైవియూ డైరెక్టర్ డా. టి. లక్ష్మిప్రసాద్ తెలిపారు. ఈ నెల 12 నుంచి 18వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పారు. మూడు సంవత్సరాల డిగ్రీ పూర్తి చేసుకున్న విద్యార్థులు నాలుగు సంవత్సరాల యు.జి కోర్సుకు అర్హులు. వివరాల కోసం www.yvu.edu.in ను సంప్రదించవచ్చు.
News December 12, 2025
నీటి భద్రతపై దేశ భవిష్యత్ ఆధారపడి ఉంది: కలెక్టర్

నీటి భద్రతపైనే దేశ భవిష్యత్ ఆధారపడి ఉందని కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. గురువారం ఢిల్లీలో ఐఐటీ, నీతి ఆయోగ్ సంయుక్తంగా నిర్వహించిన ఇండియా వాటర్ ఇంపాక్ట్ సమ్మిట్లో ఆయన పాల్గొన్నారు. జిల్లా రివర్ మేనేజ్‌మెంట్ ప్లాన్ ఫ్రేమ్‌వర్క్ కింద జిల్లా స్థాయి నీటి నిర్వహణపై ప్యానలిస్ట్‌గా మాట్లాడారు. జిల్లాలో సమర్థవంతమైన నీటి భద్రత, సంరక్షణ నిర్వహణ కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు.