News July 31, 2024

ప్రత్తిపాడు: ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్ 

image

గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి బుధవారం ప్రత్తిపాడు మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె ప్రత్తిపాడులోని ప్రభుత్వాస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్యసేవల గురించి స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఆమె మాట్లాడుతూ.. ఎటువంటి నిర్లక్ష్యం చేయకుండా రోగులకు వైద్యసేవలు అందించాలని వైద్యాధికారులకు సూచించారు. కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు. 

Similar News

News December 9, 2025

గుంటూరు NHM–NTEP పోస్టుల ఎంపిక జాబితా విడుదల

image

గుంటూరు జిల్లాలో ఎయిడ్స్, టి.బి విభాగంలో ఖాళీలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను విడుదల చేసినట్లు జిల్లా DMHO విజయలక్ష్మి తెలిపారు. ఎంపికైన వారు డిసెంబర్ 10న మధ్యాహ్నం 2.30 గంటలకు అసలు సర్టిఫికెట్లతో గుంటూరు DMHO కార్యాలయంలో అభ్యర్థులు సమయానికి హాజరుకావాలని సూచించారు. ఎంపిక జాబితా జిల్లా అధికారిక వెబ్‌సైట్ guntur.ap.gov.inలో అందుబాటులో ఉందన్నారు. ఎంపిక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా జరిగిందని తెలిపారు.

ప్రతి గురువారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్: మంత్రి అనగాని

image

రెవెన్యూ సమస్యలపై ప్రతి గురువారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తామని మంత్రి అనగాని సత్యప్రసాద్ మంగళవారం సచివాలయంలో తెలిపారు. గత ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దడానికి సమయం పడుతోందని, రిజిస్ట్రేషన్ శాఖలో పూర్తిస్థాయి మార్పులతో తప్పులకు ఆస్కారం లేని వ్యవస్థను తీసుకువస్తామన్నారు. రైతులకు త్వరగా పాస్ పుస్తకాలు జారీ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు ఆయన పేర్కొన్నారు.