News August 22, 2025
ప్రత్యేక బృందాలతో విస్తృత తనిఖీలు: కలెక్టర్

జిల్లాలో యూరియా, ఇతర ఎరువుల సరఫరాపై నిరంతర నిఘాతో అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ లక్ష్మీశా తెలిపారు. శుక్రవారం అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు తదితరులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎరువులు సమృద్ధిగా అందుబాటులో ఉన్న నేపథ్యంలో ఎక్కడా పక్కదారి పట్టకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మంత్రులు, సీఎస్ దిశానిర్దేశం చేశారు.
Similar News
News January 22, 2026
బీఈడీ రీవాల్యుయేషన్ ఫలితాలు విడుదల

కర్నూలులోని రాయలసీమ యూనివర్సిటీ బీఈడీ నాలుగో సెమిస్టర్ రీవాల్యుయేషన్ ఫలితాలను వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వెంకట బసవరావు గురువారం విడుదల చేశారు. మొత్తం 144 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా, కేవలం 28 మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. విద్యార్థులు తమ ఫలితాలను విశ్వవిద్యాలయ అధికారిక వెబ్‌సైట్ https://rayalaseemauniversity.ac.in లో చూసుకోవచ్చని ఆయన సూచించారు.
News January 22, 2026
నల్గొండలో మొదలైన రాజకీయ సెగలు

నల్గొండలో మున్సిపల్ పోరుకు ముందే రాజకీయ క్షేత్రం రగులుతోంది. అధికార ‘హస్తం’లో ఆశావహుల తాకిడి పెరగడంతో అసమ్మతి సెగలు రేగుతున్నాయి. రెబల్స్ భయం నేతలకు గుబులు పుట్టిస్తోంది. అటు ‘గులాబీ’ దళాన్ని వలసలు వేధిస్తుంటే, ‘కమలం’లో అంతర్గత విభేదాలు శాపంగా మారాయి. స్వతంత్రుల వల్ల ఎవరి ఓట్లు చీలుతాయో చూడాలి. ఓటరు నాడి ఎటుందో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.
News January 22, 2026
కామారెడ్డి మున్సిపాలిటీకి 39 ఏళ్ల చరిత్ర..!

కామారెడ్డి గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా 1987లో ఏర్పడింది. మొదట్లో 24 వార్డులతో, జనాభా పెరగడంతో 33 వార్డులుగా మారి పాలనను అందించింది. 6 ఏళ్ల క్రితం చుట్టుపక్కల గ్రామాలైన దేవునిపల్లి, లింగాపూర్, సరంపల్లి, అడ్లూరు, రామేశ్వరపల్లి, పాతరాజంపేట, టేక్రియాల్ గ్రామాలను విలీనం చేసుకొని 49 వార్డులుగా మారింది. ఇప్పటి వరకు టీడీపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల ఛైర్మన్/ఛైర్‌పర్సన్‌లుగా వ్యవహరించారు.


