News November 19, 2025
ప్రధానమంత్రి ఆవాస్ యోజన సర్వే వేగవంతం చేయాలి

బాపట్ల కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ మంగళవారం నిర్వహించిన వీక్షణ సమావేశంలో అధికారులకు ఆవాస్ ప్లస్ 2024 సర్వేను వేగవంతం చేయాలని సూచించారు. గ్రామ స్వచ్ఛత, చెత్త సేకరణ, మరుగుదొడ్ల నిర్మాణం, తాగునీటి క్లోరినేషన్ విషయాల్లో నిర్లక్ష్యం చేయరాదన్నారు. ఆదర్శ గ్రామ యోజన పనులను వేగంగా పూర్తి చేయాలని, అధికారులు నిబద్ధతతో పనిచేయాలన్నారు.
Similar News
News January 23, 2026
364 పోస్టులకు నోటిఫికేషన్

యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ 364 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. బీఈ, బీటెక్, డిగ్రీ(BA,BCom,BBA,LLB), డిప్లొమా, ఐటీఐ అర్హత గల అభ్యర్థులు ఫిబ్రవరి 1 నుంచి 28 వరకు NATS/NAPS పోర్టల్‌లో అప్లై చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 25ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.uraniumcorp.in
News January 23, 2026
ఖమ్మం మార్కెట్‌కు వరుసగా మూడు రోజులు సెలవులు

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు వరుసగా మూడు రోజుల పాటు సెలవులు ప్రకటిస్తున్నట్లు మార్కెట్ కమిటీ అధికారులు తెలిపారు. శని, ఆదివారాలు వారాంతపు సెలవులతో పాటు, సోమవారం (జనవరి 26) గణతంత్ర దినోత్సవం సందర్భంగా మార్కెట్ మూసివేయనున్నారు. తిరిగి మంగళవారం నుండి కొనుగోళ్లు యథావిధిగా ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. కావున రైతులు సెలవు రోజుల్లో తమ పంట ఉత్పత్తులను మార్కెట్‌కు తీసుకురావద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు.
News January 23, 2026
KTR విచారణ.. BRS విరాళాలపై సిట్ ఆరా?

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిట్ విచారణ 4 గంటలుగా కొనసాగుతోంది. ఓ ఛానెల్ ఎండీ స్టేట్‌మెంట్ ఆధారంగా కేటీఆర్‌ను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. 2023 ఎన్నికల సమయంలో బీఆర్ఎస్‌కు వచ్చిన విరాళాలపైనా సిట్ ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో ఎన్ని రూ.కోట్లు వచ్చాయనే వివరాలు అడిగినట్లు తెలుస్తోంది.


