News November 19, 2025
ప్రధానమంత్రి ఆవాస్ యోజన సర్వే వేగవంతం చేయాలి

బాపట్ల కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ మంగళవారం నిర్వహించిన వీక్షణ సమావేశంలో అధికారులకు ఆవాస్ ప్లస్ 2024 సర్వేను వేగవంతం చేయాలని సూచించారు. గ్రామ స్వచ్ఛత, చెత్త సేకరణ, మరుగుదొడ్ల నిర్మాణం, తాగునీటి క్లోరినేషన్ విషయాల్లో నిర్లక్ష్యం చేయరాదన్నారు. ఆదర్శ గ్రామ యోజన పనులను వేగంగా పూర్తి చేయాలని, అధికారులు నిబద్ధతతో పనిచేయాలన్నారు.
Similar News
News January 19, 2026
కడప: చంద్రప్రభ వాహనంపై దర్శనం

దేవుని కడప వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సోమవారం సాయంత్రం శ్రీలక్ష్మి సమేత వేంకటేశ్వర స్వామి చంద్రప్రభ వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. ఉత్సవమూర్తిని పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలు, రంగురంగుల పూలమాలలతో అలంకరించారు. చంద్రప్రభ వాహనంపై గ్రామ పురవీధుల్లో ఊరేగించారు. భక్తులు కాయాకర్పూరం సమర్పించి తమ భక్తిని చాటుకున్నారు.
News January 19, 2026
వేములవాడ భీమన్న సన్నిధిలో భక్తజన జాతర.. లక్షకు చేవలో దర్శనాలు

వేములవాడలో భీమేశ్వర స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. సోమవారం రాత్రి 8 గంటల వరకు మొత్తం 99,689 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ ఈవో రమాదేవి వెల్లడించారు. పవిత్ర సోమవారం కావడంతో పాటు మేడారం జాతరకు వెళ్లే భక్తులు భారీగా తరలిరావడంతో ఆలయ పరిసరాలు భక్తజన సంద్రమయ్యాయి. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
News January 19, 2026
రెవెన్యూ లోటుతో ఉక్కిరిబిక్కిరి

మూడేళ్లుగా APని రెవెన్యూ లోటు ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కమిటెడ్ వ్యయం పెరగడం, పన్నేతర ఆదాయం తగ్గడం దీనికి కారణమని కాగ్ నివేదిక పేర్కొంటోంది. FY25-26 NOV నాటికి ₹54355 CR రెవెన్యూ లోటు ఉంది. ఈ లోటు 2024లో ₹56805 CR, 2023లో ₹47063 CRగా ఉంది. దీని భర్తీకి అప్పులు చేయక తప్పడం లేదు. రుణాల్లో 80% శాలరీ, పెన్షన్లు వంటి రెవెన్యూ ఖర్చుకే సరిపోతుండగా క్యాపిటల్ వ్యయం అంతంతే.


