News November 19, 2025
ప్రధానమంత్రి ఆవాస్ యోజన సర్వే వేగవంతం చేయాలి

బాపట్ల కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ మంగళవారం నిర్వహించిన వీక్షణ సమావేశంలో అధికారులకు ఆవాస్ ప్లస్ 2024 సర్వేను వేగవంతం చేయాలని సూచించారు. గ్రామ స్వచ్ఛత, చెత్త సేకరణ, మరుగుదొడ్ల నిర్మాణం, తాగునీటి క్లోరినేషన్ విషయాల్లో నిర్లక్ష్యం చేయరాదన్నారు. ఆదర్శ గ్రామ యోజన పనులను వేగంగా పూర్తి చేయాలని, అధికారులు నిబద్ధతతో పనిచేయాలన్నారు.
Similar News
News January 23, 2026
HYD: IT హబ్‌లో ‘సర్కారు’ కొలువు!

IT హబ్‌గా పేరుగాంచిన టీ-హబ్‌లో ఇకపై ఫైళ్ల సందడి కనిపించనుంది. స్టార్టప్‌లకు కేటాయించిన ఈ ఐకానిక్ బిల్డింగ్‌లోకి బేగంపేట డివిజనల్ కమర్షియల్ ట్యాక్సెస్ ఆఫీసు మారుతోంది. ప్రైవేటు భవనాల అద్దెల భారాన్ని తగ్గించుకునేందుకు ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయంలో భాగంగా ఈ మార్పు జరుగుతోంది. ఇప్పటివరకు కార్పొరేట్ లుక్కుతో మెరిసిపోయే టీ-హబ్ వాతావరణం ఇకపై రెవెన్యూ అధికారుల రాకపోకలతో కళకళలాడనుంది.
News January 23, 2026
పుట్టు వెంట్రుకలు ఎప్పుడు తీయాలంటే?

మగపిల్లలకు 3, 5, 7, 9, 11వ నెలలో లేదా 3వ ఏట, ఆడపిల్లలకు 4, 6, 8, 10, 12వ నెలలో లేదా సరి సంవత్సరాల్లో ఈ కార్యం చేయాలని జ్యోతిష నిపుణులు సూచిస్తున్నారు. సోమ, బుధ, గురు, శుక్రవారాలు పుట్టు వెంట్రుకలు తీయడానికి అత్యంత శ్రేష్ఠమైనవని చెబుతున్నారు. ఆది, మంగళ, శనివారాలను నివారించాలని శాస్త్రం చెబుతోంది. వీలైనంత వరకు ఉదయం పూట, ముఖ్యంగా ‘సింహ లగ్నం’ లేదా ఇతర శుభ లగ్నాల్లో ఈ కార్యక్రమం నిర్వహించడం మంచిది.
News January 23, 2026
శాతావాహన యూనివర్సిటీలో మెగా జాబ్ మేళా

TG: కరీంనగర్‌లోని శాతావాహన యూనివర్సిటీలో రేపు మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. 50 కంపెనీలు IT, ఫార్మా, నర్సింగ్, హాస్పిటాలిటీ, బ్యాంకింగ్, రిటైల్, FMCG, మేనేజ్‌మెంట్ విభాగంలో 5వేల పోస్టులను భర్తీ చేయనున్నాయి. బీటెక్, ఎంటెక్, డిగ్రీ, పీజీ, ఫార్మా, నర్సింగ్ అర్హత గల అభ్యర్థులు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వర్సిటీ, నిపుణ హ్యూమన్ డెవలప్‌మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు.


