News November 19, 2025

ప్రధాని మోదీకి పుట్టపర్తిలో ఎమ్మెల్యేల స్వాగతం

image

శ్రీ సత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాలకు హాజరయ్యేందుకు పుట్టపర్తికి వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి ఘన స్వాగతం లభించింది. పుట్టపర్తి విమానాశ్రయంలో సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌, ఎమ్మెల్యేలు పల్లె సింధూరరెడ్డి, పరిటాల సునీత, కందికుంట వెంకట ప్రసాద్ తదితరులు స్వాగతం పలికారు. అనంతరం ప్రధానితో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

Similar News

News January 19, 2026

మున్సిపల్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగాలి: ఎస్పీ

image

భద్రాద్రి జిల్లా హెడ్ క్వార్టర్స్‌లో ఎస్పీ రోహిత్ రాజు జిల్లాలోని పోలీసు అధికారులతో సోమవారం నేర సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అధికారులతో ఎస్పీ మాట్లాడుతూ.. రాబోయే మున్సిపల్ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో జరిగేలా అధికారులందరూ బాధ్యతగా తమ విధులు నిర్వర్తించాలని సూచించారు. ఎలాంటి ఆవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎన్నికల నియమావళిని అనుసరించి పటిష్ఠమైన ప్రణాళికను తయారు చేసుకోవాలని సూచించారు.

News January 19, 2026

టెక్కలి: ఒకేసారి మూడు ఉద్యోగాలకు ఎంపిక

image

టెక్కలి మండలం శాసనం గ్రామానికి చెందిన కె.జ్ఞానేశ్వరరావు అనే యువకుడు ఒకేసారి మూడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికయ్యాడు. ఇండియన్ ఆర్మీ(టెక్నీకల్), SSC(CISF-GD), ఇండియన్ ఎయిర్ ఫోర్స్(అగ్నివీర్) ఉద్యోగాలకు ఎంపికయ్యాడు. యువకుడు తండ్రి సాంబమూర్తి రైతు కాగా తల్లి వరలక్ష్మీ గృహిణి. వ్యవసాయ కుటుంబంలో పుట్టి పెరిగి ఒకేసారి మూడు కేంద్ర బలగాల్లో ఉద్యోగాలు సాధించడంపై యువకుడిని పలువురు ప్రశంసించారు.

News January 19, 2026

నారాయణపేట: గణతంత్ర వేడుకలకు సర్వం సిద్ధం

image

నారాయణపేట జిల్లాలో గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ శ్రీను అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 26న ఉదయం 9 గంటలకు పోలీస్ పరేడ్ మైదానంలో కలెక్టర్ జాతీయ జెండాను ఆవిష్కరిస్తారని తెలిపారు. సాంస్కృతిక ప్రదర్శనలు, శకటాల ప్రదర్శన, భద్రతా ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.