News November 19, 2025

ప్రధాని మోదీకి పుట్టపర్తిలో ఎమ్మెల్యేల స్వాగతం

image

శ్రీ సత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాలకు హాజరయ్యేందుకు పుట్టపర్తికి వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి ఘన స్వాగతం లభించింది. పుట్టపర్తి విమానాశ్రయంలో సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌, ఎమ్మెల్యేలు పల్లె సింధూరరెడ్డి, పరిటాల సునీత, కందికుంట వెంకట ప్రసాద్ తదితరులు స్వాగతం పలికారు. అనంతరం ప్రధానితో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

Similar News

News January 19, 2026

21న జిల్లా అభివృద్ధి, పర్యవేక్షణ కమిటీ సమావేశం: కలెక్టర్

image

జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశం ఈనెల 21న జరగనుందని కలెక్టర్ దినేశ్ కుమార్ సోమవారం తెలిపారు. ఛైర్‌పర్సన్ డాక్టర్ గుమ్మ తనూజరాణి అధ్యక్షతన కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉదయం 10.30 గంటల నుంచి జరగనున్న ఈ సమావేశాలకు ఎమ్మెల్యేలు, ఎంపీపీలు హాజరుకావాలని కోరారు. అన్ని విభాగాల అధికారులు పూర్తి నివేదికలతో హాజరు కావాలన్నారు.

News January 19, 2026

ప్రభుత్వం గుడ్‌న్యూస్.. ఖాతాల్లోకి డబ్బులు

image

AP: 2025-26 ఖరీఫ్ సీజన్‌లో ఇప్పటివరకు 41.69 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు మంత్రి మనోహర్ వెల్లడించారు. కొనుగోలు చేసిన 24 గంటల్లోనే 94% నగదును రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. ఇక నుంచి ఉదయం కొనుగోలు చేస్తే సాయంత్రానికే డబ్బులు జమయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆఫీసర్లను ఆదేశించారు. మరోవైపు నేతన్నలకు మొదటి విడత త్రిఫ్ట్ ఫండ్ కింద రూ.1.67కోట్లు జమ చేసినట్లు మంత్రి సవిత వెల్లడించారు.

News January 19, 2026

బాపట్ల: ఉచిత పశుఆరోగ్య శిబిరాల ఏర్పాటు

image

బాపట్ల జిల్లా వ్యాప్తంగా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఉచిత పశు ఆరోగ్య శిబిరాలు సోమవారం నుంచి ఈనెల 31వ తేదీ వరకు అన్ని గ్రామాల్లో నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలో ఉచిత పశు ఆరోగ్య వైద్య శిబిరాల పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ వైద్య శిబిరంలో గర్భనిర్ధారణ పరీక్షలు, నట్టల నివారణ మందులతోపాటు వ్యాధి నివారణ టీకాలు వెయ్యనున్నట్లు వివరించారు.