News November 19, 2025
ప్రధాని మోదీకి పుట్టపర్తిలో ఎమ్మెల్యేల స్వాగతం

శ్రీ సత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాలకు హాజరయ్యేందుకు పుట్టపర్తికి వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి ఘన స్వాగతం లభించింది. పుట్టపర్తి విమానాశ్రయంలో సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఎమ్మెల్యేలు పల్లె సింధూరరెడ్డి, పరిటాల సునీత, కందికుంట వెంకట ప్రసాద్ తదితరులు స్వాగతం పలికారు. అనంతరం ప్రధానితో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
Similar News
News January 23, 2026
నేషనల్ సెంటర్ ఫర్ ఎర్త్ సైన్స్ స్టడీస్‌లో ఉద్యోగాలు

<
News January 23, 2026
ఆర్థిక సంస్థల కేంద్రంగా అమరావతి: CBN

AP: వ్యవసాయంతో పాటు రెన్యూవబుల్ ఎనర్జీ సంస్థలకూ అధిక రుణాలివ్వాలని CM CBN బ్యాంకర్ల సమావేశంలో సూచించారు. డిస్కంలు కూడా కౌంటర్ గ్యారంటీ ఇస్తున్నాయని చెప్పారు. ‘అమరావతిని ఆర్థిక సంస్థల కేంద్రంగా మారుస్తున్నాం. 15 బ్యాంకుల ప్రధాన కార్యాలయాలు ఏర్పాటవుతున్నాయి. డ్వాక్రా సంఘాల ఖాతాలపై వేస్తున్న 15 రకాల ఛార్జీలను తగ్గించాలి. ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్‌ను ప్రోత్సహించాలి’ అని పేర్కొన్నారు.
News January 23, 2026
ఉమ్మడి పాలమూరు జిల్లాలో 11 మంది సీఐల బదిలీ

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలో పని చేస్తున్న 11 మంది సీఐలను బదిలీ చేస్తూ మల్టీ జోన్-2 అదనపు డీజీపీ చౌహాన్ ఉత్తర్వులు జారీ చేశారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఈ బదిలీలు జరిగినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా జిల్లా ట్రాఫిక్ సీఐగా ఉన్న భగవంత రెడ్డిని మరికల్‌కు బదిలీ చేశారు. బదిలీ అయిన వారు తక్షణమే తమ కొత్త స్థానాల్లో విధుల్లో చేరాలని ఆదేశించారు.


