News November 19, 2025

ప్రపంచంలో మొదటి ముద్దు ఎప్పుడు పెట్టారు?

image

ప్రేమ అనే భావానికి మాటలు అవసరం లేకుండా హృదయంతో తెలిపే భావమే ముద్దు. ఇద్దరి పెదాలు సున్నితంగా తాకే ఆ చిన్న స్పర్శలోనే నమ్మకం, ఆప్యాయత, ప్రేమ ఉంటాయి. మానవులు మాత్రమే కాకుండా పిల్లులు, పక్షులు, కోతులు ఇలా అనేక జీవులు ముద్దు పెట్టుకుంటాయి. నిజానికి ఫస్ట్ కిస్ సుమారు 2కోట్ల ఏళ్ల క్రితం జరిగిందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అయితే ఇది మనుషుల మధ్య కాదు అప్పట్లో ఉండే కోతి జాతికి చెందిన వాటితో మొదలైంది.

Similar News

News January 19, 2026

జంపన్న గద్దె ఆధునీకరణ ఎప్పుడు?

image

రాష్ట్ర ప్రభుత్వం రూ.251 కోట్లతో మేడారం జాతర రూపురేఖలను మార్చివేసింది. సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెలను సకల హంగులతో ఆధునీకరించింది. అయితే, భక్తులు ముందుగా దర్శించుకునే జంపన్న గద్దె పరిస్థితి మాత్రం పాతబడే ఉంది. ఇతర గద్దెల ప్రాంగణాలు అద్భుతంగా ముస్తాబైనా, జంపన్న గద్దెను విస్మరించడంపై భక్తులు పెదవి విరుస్తున్నారు. వచ్చే జాతర నాటికైనా ఈ గద్దెకు మహర్దశ పడుతుందో లేదో వేచి చూడాలి.

News January 19, 2026

HYD: షుగర్ పేషెంట్లకు భరోసా ఇస్తున్న ‘పెద్ద దవాఖానా’

image

షుగర్ పేషెంట్ల కాలికి గాయాలైనపుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అజాగ్రత్త వహిస్తే చివరకు కాలు కూడా తీయాల్సి వస్తుంది. అయితే ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు ప్రత్యేక చికిత్స అందించి రోగులకు భరోసా ఇస్తున్నారు. ఆస్పత్రిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డయాబెటిక్ ఫుట్ కేర్ సెంటర్లో వైద్యులు ఉత్తమ వైద్య సేవలందిస్తున్నారని HOD డా.నీలవేణి తెలిపారు. 2022లో ప్రారంభమైన ఈ సెంటర్లో నెలకు 200 మంది చికిత్స పొందుతున్నారు.