News March 13, 2025

ప్రబలతో దద్దరిల్లనున్న కొమ్మాల!

image

హోలీ రోజు జరిగే గీసుగొండ కొమ్మాల జాతరకు తరలివచ్చే ఎడ్ల బండ్ల ప్రభలు, రాజకీయ ప్రభలకు దశాబ్దాల చరిత్ర ఉంది. వేలాది భక్తులు ప్రభ బండ్లను ఊరేగింపుగా తీసుకొస్తారు. హోలీ రోజు, నిండు పౌర్ణమి సందర్భంగా భక్తులు, రాజయకీయ నాయకులు ఎడ్లబండ్లు, ఒంటె, ఏనుగు, గుర్రం, మేక వంటి ప్రబలతో ఇక్కడికి వస్తుంటారు. పోటీ పడీ మరీ ప్రభలను ఎత్తులో నిర్మిస్తుంటారు. వరంగల్ నుంచి కూడా ఇక్కడకు ఎడ్లబండ్లపై వస్తుండటం విశేషం.

Similar News

News February 13, 2026

VJA: గవర్నర్‌తో డిప్యూటీ సీఎం పవన్ భేటీ

image

విజయవాడలోని లోక్ భవన్‌లో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శుక్రవారం కలిశారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ చేసిన ప్రసంగం ప్రభుత్వ లక్ష్యాలను, అభివృద్ధి దిశను స్పష్టంగా ప్రతిబింబించిందని ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుపై గవర్నర్‌తో పవన్ చర్చించారు. ప్రభుత్వ ప్రాధాన్యతలను గవర్నర్‌కు వివరించినట్లు సమాచారం.

News February 13, 2026

తూర్పు దిశలో ఇల్లు కట్టుకుంటే?

image

తూర్పు దిక్కు ఇంటికి చాలా శుభప్రదమని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. దీనివల్ల లక్ష్మీ, సరస్వతుల కటాక్షం లభిస్తాయని అంటున్నారు. ‘ఇది సూర్యుడు ఉదయించే దిశ. అందువల్ల ఇక్కడ ఉండేవారు ఆరోగ్యవంతులు, ఉత్సాహవంతులుగా ఉంటారు. ఈ దిశకు అధిపతి ఇంద్రుడు. తద్వారా సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగే అవకాశాలుంటాయి. వాస్తు నియమాలు పాటిస్తే ఆశయాలు నెరవేరి సంతృప్తికర జీవితం గడుపుతారు’ అని చెబుతున్నారు. <<-se>>#Vasthu<<>>

News February 13, 2026

NZB: స్రవంతి రెడ్డికి (BJP) సర్టిఫికెట్ అందజేత

image

నిజామాబాద్ నగరంలోని 6వ డివిజన్‌లో గెలుపొందిన బీజేపీ అభ్యర్థి గోపిడి స్రవంతి రెడ్డికి ఎన్నికల అధికారులు ధ్రువీకరణ పత్రం అందజేశారు. కంఠేశ్వర్ ప్రాంతానికి చెందిన గోపిడి స్రవంతి రెడ్డిని బీజేపీ తరఫున మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన విషయం తెలిసిందే. గత కార్పొరేషన్‌లో ఆమె బీజేపీ ఫ్లోర్ లీడర్‌గా పని చేశారు.