News March 13, 2025

ప్రభలతో దద్దరిల్లనున్న కొమ్మాల!

image

హోలీ రోజు జరిగే గీసుగొండ కొమ్మాల జాతరకు తరలివచ్చే ఎడ్ల బండ్లు, రాజకీయ ప్రభలకు దశాబ్దాల చరిత్ర ఉంది. వేలాది భక్తులు ప్రభ బండ్లను ఊరేగింపుగా తీసుకొస్తారు. హోలీ రోజు, నిండు పౌర్ణమి సందర్భంగా భక్తులు, రాజయకీయ నాయకులు ఎడ్లబండ్లు, ఒంటె, ఏనుగు, గుర్రం, మేక వంటి ప్రభలతో ఇక్కడికి వస్తుంటారు. పోటీ పడి మరీ ప్రభలను ఎత్తులో నిర్మిస్తుంటారు. వరంగల్ నుంచి కూడా ఇక్కడకు ఎడ్లబండ్లపై వస్తుండటం విశేషం.

Similar News

News February 13, 2026

‘అనంత బాలోత్సవం’ బ్రోచర్ ఆవిష్కరణ

image

అనంతపురంలోని SSBN కళాశాలలో ఈనెల 21, 22వ తేదీల్లో జరగనున్న ‘6వ అనంత బాలోత్సవం’ పోస్టర్‌ను శుక్రవారం జిల్లా కలెక్టర్ ఆనంద్ బాబు ఆవిష్కరించారు. చిన్నారుల్లోని సృజనాత్మకతను వెలికితీసేందుకు ఈ పిల్లల పండుగను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్‌తో పాటు ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి పరమేశ్, అధ్యాపకులు, అధికారులు పాల్గొన్నారు.

News February 13, 2026

రామగుండం కార్పొరేషన్ ‘హస్త’గతం

image

రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించింది. మొత్తం 60 డివిజన్లలో 38 స్థానాలను కైవసం చేసుకొని మేయర్ పీఠాన్ని దక్కించుకుంది. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ 13 స్థానాల్లో విజయం సాధించగా, ఏఐఎఫ్‌బీ 6 స్థానాలకు పరిమితమైంది. బీజేపీ, సీపీఐ, ఇండిపెండెంట్ ఒక్కో స్థానంలో గెలుపొందారు. దీంతో కాంగ్రెస్ శ్రేణుల గెలుపు సంబరాలు మిన్నంటాయి.

News February 13, 2026

ఖమ్మం జిల్లాలో ఏ పార్టీ.. ఎన్ని వార్డులు గెలిచిందంటే?

image

ఖమ్మం జిల్లాలోని 5 మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. గెలిచిన పార్టీల వివరాలిలా..
☆ 1) ఏదులాపురం(32 వార్డులు).. కాంగ్రెస్-24, BRS-2, CPM-2, CPI-3, ఇండిపెండెంట్(IND)-1
☆ 2) వైరా(20).. కాంగ్రెస్-12, BRS-5, CPM-1, CPI-1, IND-1
☆ 3) సత్తుపల్లి(23).. కాంగ్రెస్-17, BRS-6
☆ 4) కల్లూరు(20).. కాంగ్రెస్-12, BRS-7, IND-1
☆ 5) మధిర(22).. కాంగ్రెస్-18, BRS-1, IND-3.