News August 14, 2025

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య: DEO

image

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సిద్దిపేట ఈడీవో శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నారాయణరావుపేటలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఉపాధ్యాయుల సహకారంతో లక్ష రూపాయల విలువైన షూలు, ఐడి కార్డులు, బెల్టులు వంటి అందజేశారు.

Similar News

News March 12, 2026

సిద్దిపేట: టెన్త్ పరీక్షలు.. డీఈఓ కీలక సూచనలు

image

ఈనెల 14వ తేదీ నుంచి టెన్త్ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో విద్యార్థులకు సిద్దిపేట DEO శ్రీనివాస్ రెడ్డి కీలక సూచనలు చేశారు. విద్యార్థులు గంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలన్నారు. మొబైల్ ఫోన్లు, వాచీలు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. విద్యార్థుల వస్తువుల భద్రత కోసం క్లాక్ రూమ్ సౌకర్యం కల్పించామని తెలిపారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా అందరూ సహకరించాలని కోరారు.

News March 12, 2026

బాబాయ్, అబ్బాయ్ అనుబంధం జగన్‌కు బాగా తెలుసు: కదిరి ఎమ్మెల్యే

image

బాబాయ్, అబ్బాయ్ అనుబంధం జగన్‌కు బాగా తెలుసని కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ అన్నారు. బుధవారం ఆయన అనంతపురంలో మీడియాతో మాట్లాడారు. గతంలో ఒక బాబాయ్ హత్య గురించి తప్పు దోవ పట్టించారని, తిరుమలలో నెయ్యి కల్తీ జరిగిందని సుబ్బారెడ్డి ఒప్పుకున్నారని అన్నారు. పులివెందుల పక్కనే ఉన్నా జగన్ కదిరి ఆలయానికి ఎప్పుడైనా వచ్చారా అని ప్రశ్నించారు. ఏదో చిన్న ఘటన జరిగితే.. దానిని రాజకీయం చేస్తున్నారన్నారు.

News March 12, 2026

ఈ నెలలోనే రైతు భరోసా: మంత్రి వివేక్

image

TG: ‘రైతు భరోసా’ నిధుల విడుదల కోసం ఎదురుచూస్తున్న అన్నదాతలకు మంత్రి వివేక్ శుభవార్త చెప్పారు. ఈ నెల నుంచే రైతు భరోసా పంపిణీ చేయనున్నట్లు చెన్నూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో వెల్లడించారు. రైతు భరోసా కింద మొత్తం రూ.9,000కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు పేర్కొన్నారు. మార్చిలో తొలి విడతగా రూ.4,500కోట్లు, మిగతావి వచ్చే నెలలో రిలీజ్ చేస్తామని స్పష్టం చేశారు.